బీజేపీ సీనియర్ నేత.. మాజీ కేంద్రమంత్రి.. పెద్దమనిషి మురళి మనోహర్ జోషికి మంటపుట్టేలా ఓ ఉదంతం చోటు చేసుకుంది. మోడీ జమానాలో తనకు ఏ మాత్రం ప్రాధాన్యత లభించటం లేదన్న ఆవేదనను ఈ సీనియర్ నేత ఆవేదన చెందుతున్న వేళ.. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధికారుల కంగాళీ ఏర్పాట్లు మరింత కాలేలా చేశాయని చెప్పాలి.
తన్నుకొస్తున్న చిరాకును ఎంతగా అదిమి పెట్టుకోవాలని ప్రయత్నించినా.. అధికారుల పుణ్యమా అని అది సాధ్యం కాలేదు. ఇంతకీ జరిగిందేమంటే.. కాన్పూర్ కలెక్టరేట్ లో సౌర విద్యుత్ ఫలకల వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ఓపెనింగ్ కు స్థానిక ఎంపీ అయిన బీజేపీ సీనియర్ నేత మురళి మనోహర్ జోషిని పిలిచారు. ఆ కార్యక్రమానికి రావటానికి ఆయన ఓకే చేశారు.
ఇక్కడ వరకూ అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఓపెనింగ్ దగ్గరకు వచ్చేసరికి అధికారుల తీరుతో వ్యవహారం ఒక్కసారిగా మారింది. ఓపెనింగ్‌కు పిలిచి.. రిబ్బన్ కట్టటం వరకూ అధికారులు పక్కాగా చేసినా.. రిబ్బన్ కట్ చేయటానికి అవసరమైన కత్తెరను మర్చిపోయారు. ఎంపీగారు వచ్చేసి రిబ్బన్ ముందు నిలబడ్డాక.. కత్తెర కోసం పరుగులు పెట్టటం మురళి మనోహర్ జోషికి మంట పుట్టింది. అప్పటికి త్రీ మినిట్స్ వెయిట్ చేసిన ఆయన.. అప్పటికి కత్తెర రాకపోవటంతో ఆగ్రహానికి గురయ్యారు. చేత్తో రిబ్బన్ ను పీకేసి.. ఓపెనింగ్ అయిపోయిందని తేల్చేశారు.
అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రఆగ్రహానికి గురైన ఆయన.. ఏర్పాట్లపై అక్కడి వారిని క్లాస్ పీకారు. అంతేకాదు.. తిరిగి వెళుతూ ఆక్షింతలతో పాటు.. కత్తెర ఏర్పాటు చేయకుండా ఎలా మిస్ చేశారో చెప్పాలంటూ తనకు రిపోర్ట్ ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసి తన దారిన తాను వెళ్లారు. అయినా.. ఓపెనింగ్‌కు పిలిచి.. కత్తెర మర్చిపోవటం ఏమిటి?
Full View