ఉత్తరప్రదేశ్ పరిశీలకుడిగా నియమితులైన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తన పని మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది. ఈనెల 16న ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ రాష్ట్రంలోని పరిస్థితులపై వెంకయ్య అధ్యయనం చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ యూపీలో బీజేపీ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో ముస్లింలకు ప్రాతినిథ్యం ఉంటుందని అన్నారు. ఇటీవల యూపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో ముస్లింలు ఎవరికీ పార్టీ టికెట్ దక్కకపోయిన విషయాన్ని విలేకరులు ప్రశ్నించగా... ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రభుత్వంలో ముస్లిం మంత్రి ఉంటారని వివరించారు.
తమ పార్టీ తరఫున ముస్లిం ఎమ్మెల్యేలు లేరనే విషయాన్ని అంగీకరించిన వెంకయ్య నాయుడు ఇందుకు ప్రత్యామ్నాయం చూపారు. ఎమ్మెల్యే కాకపోతే ఎమ్మెల్సీ రూపంలో అయినా ప్రభుత్వంలో మాత్రం ముస్లింలకు ప్రాతినిథ్యం ఉండి తీరుతుందని స్పష్టం చేశారు. యూపీలో మెజార్టీ ఓటు బ్యాంకు అయిన ముస్లింలు ఈ దఫా బీజేపీకి ఓటు వేశారు. ముఖ్యంగా మహిళలు-యువత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి అజెండాను అంగీకరించి...తమవైపు మొగ్గు చూపారని కమలనాథులు భావిస్తున్నారు. ట్రిపుల్ తలాక్ అంశానికి వ్యతిరేకంగా ముందుకు సాగడం వంటి విషయాలతో ముస్లిం మహిళలకు చేరువ అయ్యామనే భావనలో బీజేపీలో ఉంది. ఈ నేపథ్యంలోనే మైనార్టీ ఎమ్మెల్సీని ఎంపిక చేసి మంత్రి పదవి ఇస్తారని భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/