కరోనా కేసులు దేశంలో రోజురోజుకు పెరుగుతున్న వేళ కేంద్రం ప్రభుత్వం దేశ ప్రజలకు ముఖ్యమైన సూచన చేసింది. ఇక నుంచి ప్రజలు తమ ఇంట్లో ఉన్నా కూడా మాస్క్ ధరించాలని సూచించింది. ప్రస్తుత పరిస్తితుల్లో ఎవరూ అనవసరంగా బయటకు వెళ్లొద్దని.. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నప్పుడు కూడా మాస్క్ ధరించాలని నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. ఎవరిని ఇంటికి ఆహ్వానించొద్దని సూచించారు.
ఇక కరోనా వేగంగా దేశంలో విస్తరిస్తోందని.. భౌతిక దూరం ఖచ్చితంగా పాటించాలని వీకే పాల్ చెప్పారు. ఒక వ్యక్తి నుంచి 30 రోజులలో 406 మందికి వైరస్ సంక్రమించే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయని అధికారులు తెలిపారు. మొత్తంగా ప్రస్తుతం రెండో వేవ్ ఖచ్చితంగా ఇంట్లో ఉన్నా.. బయట ఉన్నా మాస్క్ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. సెకండ్ వేవ్ పోయే వరకు ఇది తప్పదని సూచించింది.