ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అనుకోని ఇబ్బంది వచ్చింది. ఆయన పార్టీకే చెందిన సీనియర్ నేత ఒకరు చంద్రబాబు తనను దారుణంగా మోసగించారంటూ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. రాష్ట్రస్థాయిలో పెద్దగా పేరున్న నేత కానప్పటికీ సొంత పార్టీకి చెందిన సీనియర్ లీడర్ ఏకంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆమరణ దీక్షకు దిగడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.
తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ సీనియర్ నేతల్లో ఒకరైన ముత్యాల రాజబ్బాయి చంద్రబాబు తనను మోసగించారంటూ ఆమరణ దీక్షకు దిగారు. ఎన్నికల ముందు ప్రజలకు ఎన్నో హామీలిచ్చినట్లే తనకూ హామీలిచ్చారని.. వాటిని నమ్మి తాను కోట్లు రూపాయలు ఖర్చు చేసి మోసపోయానని ఆరోపించారు. పెద్దాపురం నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ తనకు ఇస్తామన్నారని.. ఎన్నికలకు ఎంతో ముందుగానే తనకు హామీ ఇవ్వడంతో అక్కడ పార్టీని కాపాడుకునేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశానని చెబుతున్నారు. అయితే... తీరా ఎన్నికలు వచ్చేసరికి తనను పక్కనపెట్టి నిమ్మకాయల చినరాజప్పకు టిక్కెట్ ఇచ్చారని.. ఆ సమయంలో చంద్రబాబు మరోసారి తనకు మాయమాటలు చెప్పారని.. ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తామనడంతో తాను చినరాజప్ప గెలుపు కోసం పూర్తి స్థాయిలో పనిచేశానని అన్నారు. అయితే... తనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వకుండా చంద్రబాబు హ్యాండిచ్చారని రాజబ్బాయి ఆరోపిస్తున్నారు.
పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండేళ్లుగా చంద్రబాబు హామీలేవైనా నిలుపుకొంటారేమోనని ఎదురుచూసి విసిగిపోయి ఆమరణ దీక్షకు దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు రాజబ్బాయి తన ఇంట్లోనే ఆమరణ దీక్ష చేపట్టారు. పార్టీ సీనియర్ నేత ఒకరు ఇలా నేరుగా చంద్రబాబును విమర్శిస్తూ ఆమరణ దీక్షకు దిగడంతో పార్టీలో కలకలం రేగింది. దీంతో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ఆయన్ను బుజ్జగించేందుకు వెళ్లారు. కాగా బుధవారం చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో రాజబ్బాయి ఇలా దీక్షకు దిగినట్లు తెలుస్తోంది.