మ‌ళ్లీ మాట మార్చిన బాబు.. పోరాటం ఈసీ మీద కాద‌ట‌!

Update: 2019-05-11 11:21 GMT
మాట‌ల్ని మార్చేసే విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ట్రాక్ రికార్డు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లుగా ఆయ‌న మాట‌లు మారిపోతుంటాయి. మొన్న‌టివ‌ర‌కూ అదేప‌నిగా ఈసీ మీద రంకెలు వేసిన ఆయ‌న‌.. తాజాగా అందుకు భిన్న‌మైన స్వ‌రాన్ని వినిపిస్తున్నారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఈవీఎంల‌లో పోలైన ఓట్ల‌ను.. వీవీ ప్యాట్ ల‌లో పోలైన ఓట్ల‌ను లెక్కించాల‌ని.. ఈ రెండింటి లెక్క స‌రిపోయేలా ఉన్నాయా?  లేదా? అన్న విష‌యాన్ని చూశాకే ఫ‌లితాల్ని వెల్ల‌డించాల‌ని బాబు కోరుతున్న సంగ‌తి తెలిసిందే.తాను లేవ‌నెత్తిన ఈ విష‌యాన్ని సుప్రీంలో తేల్చుకునేందుకు త‌న‌తోపాటు క‌లిసి వ‌చ్చే పార్టీల‌తో క‌లిసి పిటిష‌న్ దాఖ‌లు చేయ‌టం తెలిసిందే.

బాబు అండ్ కో లేవ‌నెత్తిన వాద‌న‌ను సింఫుల్ గా తేల్చేసిన సుప్రీం.. ఈ అంశంపై తాను పున‌ర్ విచార‌ణ జ‌ర‌ప‌లేద‌ని తేల్చేశారు. అప్ప‌టివ‌ర‌కూ ఈసీని ల‌క్ష్యంగా చేసుకొని ప‌లు విమ‌ర్శ‌లు చేసిన చంద్ర‌బాబు.. తాజాగా అందుకు భిన్న‌మైన ట్వీట్ల‌ను చేశారు. అన్నింటిలోనూ ఆయ‌న ప్ర‌ధాని మోడీ ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 50 శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కించాల‌నే అంశాన్ని ప్ర‌స్తావిస్తూ.. త‌న పోరాటం భార‌త ఎన్నిక‌ల సంఘం మీద‌కాద‌ని.. త‌న పోరాటం అధికారుల వివ‌క్ష పైనా.. ప‌క్ష‌పాత ధోర‌ణిపైనే అంటూ క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. మోడీ.. అమిత్ షాల‌పై మోడ‌ల్ కోడ్ ఆఫ్ కాండ‌క్ట్ ను ఈసీ అమ‌లు చేయ‌క‌పోవ‌టంపైనే పోరాటం చేస్తాన‌ని తాజా ట్వీట్ల‌తో స్ప‌ష్టం చేశారు.

ఎన్నిక‌ల షెడ్యూల్ కు 73 రోజులు తీసుకున్న ఈసీ యాభై శాతం వీవీ ప్యాట్ లెక్కింపున‌కు మ‌రో ఆరు రోజులు తీసుకోవ‌టానికి ఎందుకంత అభ్యంత‌రం?  మోడీకి ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు?  యాభై శాతం వీవీ ప్యాట్ లు లెక్కించాల‌ని ఈసీని ప్ర‌తిప‌క్షాలు అడిగితే.. మోడీకేం సంబంధం?  ఆయ‌న ఎందుకు ఉలిక్కిప‌డుతున్నారు? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

రాజ‌కీయ లాభం కోసం ఎప్పుడో చ‌నిపోయిన నాయ‌కుల్ని.. వారి కుటుంబ స‌భ్యుల్ని కించ‌ప‌ర్చేందుకు సైతం మోడీ వెనుకాడ‌ర‌న్నారు. ర‌క్ష‌ణ శాఖ‌ను.. సైన్యాన్ని వాడుకుంటున్నార‌ని.. మ‌తాల మ‌ధ్య చిచ్చు పెట్టి రాజ‌కీయ నాయ‌క‌త్వాన్ని చంపేస్తున్నార‌ని.. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఆయ‌న నీతివ‌చ‌నాలు ప్ర‌బోధించ‌ట‌మా? అని ప్ర‌శ్నించారు. తాజా ట్వీట్లు మొత్తం మోడీషాల‌ను టార్గెట్ చేయ‌టం ఒక ఎత్తు అయితే.. సుప్రీం రెండోసారి నో అన్న త‌ర్వాత కూడా యాభై శాతం వీవీ ప్యాట్ స్లిప్పుల‌ను లెక్కించే అంశాన్ని అదే ప‌నిగా ప్ర‌స్తావిస్తుండ‌టం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News