ఇక నా లక్ష్యం అమెరికా అభివృద్ధే.. ఇందుకు వాగ్దానం చేస్తున్నా : బైడెన్

Update: 2020-11-08 04:15 GMT
సుదీర్ఘ అమెరికా ఎన్నికల ప్రక్రియలో ఓటింగ్ అంకం  ముగిసిన తర్వాత కూడా ఫలితాల వెల్లడికి సమయం పట్టింది.దీంతో  అమెరికా తదుపరి అధ్యక్షుడిగా తిరిగి ట్రంపే  బాధ్యతలు చేపడతాడా, లేకపోతే జో బైడెన్ సంచలనం సృష్టిస్తాడా అని రోజుల తరబడి ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు ఆ ఉత్కంఠకు తెర తొలగి జో బైడెన్ సంచలన విజయాన్ని అందుకున్నారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. జో సంచలన విజయంతో అమెరికా వ్యాప్తంగా ఇప్పుడు డెమోక్రాట్ల సంబరాలు ఆకాశాన్నంటుతున్నాయి. బైడెన్ విజయానికి కావాల్సిన 273 ఓట్ల మార్క్  చేరుకోవడంతో పాటు 300 ఓట్ల వైపుగా దూసుకెళ్తున్నారు.

భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ తొలి అమెరికా మహిళా అధ్యక్షురాలిగా ఎన్నిక కానుంది. అమెరికాలో అందరికీ హక్కులు,  ముస్లింలకు ప్రవేశాలు, కరోనాకు వ్యాక్సిన్ అందజేస్తామని ప్రచారం నిర్వహించడంతో బైడెన్ కు అమెరికా ప్రజలు హారతి పలికారు. ఫలితాల అనంతరం జో బైడెన్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అగ్రదేశ మైన, గొప్ప దేశమైన అమెరికాకు తనను అధ్యక్షుడిగా ప్రజలు ఎన్నుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. అమెరికా మరింత అభివృద్ధి సాధించడానికి తన వంతు కష్టపడి పని చేస్తానని, దీనిపై తాను వాగ్దానం చేస్తున్నానంటూ బైడెన్ ట్వీట్ చేశారు. 1992 నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు ఓ ఆనవాయితీ పాటిస్తూ వస్తున్నారు.

ఒకసారి అధ్యక్షుడిగా గెలిచిన వ్యక్తి ని తిరిగి అనుకుంటూ వచ్చారు. ట్రంప్ ఒక్కడే ఒక సారి విజయం తర్వాత రెండోసారి పరాజయం పాలయ్యారు. గతంతో పోలిస్తే మెయిల్ బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు తీవ్ర  ప్రభావం చూపించాయి. ఆ   ఓట్లలో మెజారిటీ శాతం బైడెన్ కే వచ్చాయి. ఈ విషయంలో ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  కాగా ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో  బై డెన్ అమెరికా ఉపాధ్యక్ష పదవిలో కొనసాగారు. డెలావర్‌కు సెనేటర్‌గా కూడా పనిచేశారు. కమలా హ్యరిస్  తొలి మహిళ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. తొలి నల్ల జాతీయురాలిగా  అత్యున్నత పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
Tags:    

Similar News