రేపిస్టు బయటకొచ్చాడు.. భయంగా ఉంది సీఎం!

Update: 2016-10-06 05:03 GMT
"నాపై అత్యాచారానికి పాల్పడిన పవర్ ఫుల్ రాజకీయ నాయకుడు రాజ్ బల్లాబ్ యాదవ్ బెయిల్ పై జైలు నుంచి బయటకొచ్చాడు. ఇప్పుడు నేను, నా కుటుంబం గురించి చాలా భయపడుతున్నాను. నాకు జరిగిన సంఘటనతో ఇప్పటికే నేను చచ్చిపోయిన దాన్ని.. నేను కోల్పోయేందుకు ఇంకేం లేదు. అతడు నన్ను నా కుటుంబాన్ని ఏక్షణంలో నైనా చంపగలడు. పోలీసులు కూడా అతడికి భయపడుతున్నారు" అంటూ ఆ బాలిక మొరపెట్టుకుంది.. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం దేశం ఉంది!!

రాజకీయ నాయకులు జనాల్లోకి వస్తే ఎదురెల్లి స్వాగతం పలికే రోజులు పోయాయి సరికదా, వారు నేరాలు చేసి జైలుకు వెళ్లి తిరిగి బయటకు వస్తుంటే సాధారణ ప్రజానికం భయంతో వణికిపోతుంది. ఆ స్థాయిలో మన నేతల ప్రవర్తన ఉంది మరి! వినడానికి సినిమాలో విలన్ ని పోలిన కథలా అనిపిస్తున్నా, ఇది అక్షరాలా నిజం!! ఈ మేరకు తనపై లైంగిక దాడికి పాల్పడిన పవర్ ఫుల్ రాజకీయ నాయకుడు ఒకడు బెయిల్ పై బయటకొచ్చాడని.. దాంతో తనకు చాలా భయంగా ఉందని.. తన కుటుంబాన్ని నాశనం చేస్తాడేమోనని భయపడుతున్న పది హేనేళ్ల బాలిక కథ ఇది. ఈ మేరకు భయబ్రాంతులకు గురైన ఆ బాలిక బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు విజ్ఞప్తి చేసుకుంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఆర్జేడీలోని శక్తిమంతమైన నాయకుల్లో ఒకరైన రాజ్ బల్లాబ్ యాదవ్, పదో తరగతి చదువుతున్న ఒక బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఒక మహిళ ద్వారా ఆ అమ్మాయిని అటకాయించిన ఆ ఎమ్మెల్యే సభసమాజం తలదించుకునేలా, ఈ నిస్సిగ్గు పనికి తెగించి ఈ దారుణానికి దిగాడు. ఈ పనికిమాలిన పనిచేసిన ఆ నేత, రూ.30 వేలు తీసుకొమ్మని ఆ బాలికకు ఆఫర్ చేశాడు. ఈ దారుణంపై ఎదురుతిరిగిన ఆ అమ్మాయి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ ఫిర్యాదు తర్వాత నెల రోజులపాటు పరారీలో ఉన్న రాజ్ బల్లాబ్, అనంతరం లొంగిపోగా జైలులో విచారిస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ, గత శనివారంతో పరిస్థితులు మారిపోయాయి. ఆ పవర్ ఫుల్ రాజకీయనాయకుడికి బెయిల్ వచ్చింది, ఫలితంగా బయటకొచ్చాడు. ఈ నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురైన ఆ బాలిక, తన విజ్ఞప్తిని ముఖ్యమంత్రి నితీశ్ కు వాట్సాప్ ద్వారా పంపించింది. ఇదే సమయంలో జర్నలిస్టులకు, ఇతర ప్రముఖ వ్యక్తులకూ సమాచారం పంపించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News