ఇలాంటి పెళ్లి మీరెక్క‌డా చూసి ఉండ‌రు

Update: 2017-10-08 10:17 GMT
పెళ్లి అంటే.. రెండు జీవితాలు ఒక్కటి కావ‌టం. ఈ కార్యాన్ని ఎవ‌రికి వారు వారి.. వారి స్థాయిల్లో చేసేసుకుంటుంటారు. పెళ్లి వేదిక‌లు మొద‌లుకొని పిండివంట‌ల వ‌ర‌కూ మిగిలిన వారి కంటే భిన్నంగా.. సో.. స్పెష‌ల్ గా ఉండేందుకు విప‌రీతంగా ట్రై చేయ‌టం క‌నిపిస్తుంది. ఇందులో భాగంగా డ‌బ్బును మంచినీళ్ల మాదిరి ఖ‌ర్చు చేస్తుంటారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మ‌రికొంద‌రు త‌మ పెళ్లిళ్ల‌ను ఆకాశంలోనూ.. నీళ్ల లోప‌ల చేసుకోవటం వార్త‌ల్లో అప్పుడ‌ప్ప‌డు చూస్తుంటారు. ఇప్పుడు మేం చెప్ప‌బోయే పెళ్లి వీట‌న్నింటికి కంటే ప్ర‌త్యేకం. ఇంత‌కీ ఈ పెళ్లి ఎక్క‌డో స‌దూరంగా ఉండే ఏ విదేశంలో జ‌ర‌గ‌లేదు. తెలుగు నేల మీద‌.. అది కూడా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోనే జ‌రిగింది.

ఇంత‌కీ.. ఈ పెళ్లి ప్ర‌త్యేక‌త ఏమిటంటే..

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పెర‌వ‌లి మండ‌లం ముక్కామ‌ల గ్రామంలో చిత్ర‌విచిత్ర‌మైన పెళ్లి జ‌రిగింది. గ్రామానికి చెందిన శ్రీధ‌ర్ స్వామిజీ త‌న కుమార్తె పెళ్లిని దేవ‌త‌ల ప‌రిణ‌యంగా జ‌రిపించారు. సాక్షాత్తు విష్ణుమూర్తి వేషంలో పెళ్లికొడుకు.. లక్ష్మీదేవిగా పెళ్లికుమార్తె హ‌ర్షిత‌ను ముస్తాబు చేశారు. అక్క‌డితో ఆగితే అదో ప‌ద్ధ‌తి.

ఇక‌.. కుటుంబ స‌భ్యులంతా దేవ‌తామూర్తుల అవ‌తారాల్లో హాజ‌రై పెళ్లి వేడుక నిర్వ‌హించ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ పెళ్లి వేడుక‌ను చూస్తే.. పౌరాణిక నాట‌కాన్ని త‌ల‌పించేలా ఉంది. పెళ్లి వేడుక మొత్తం ఏదో కొన్ని యుగాల కింద జ‌రిగితే ఎలా ఉంటుందో అచ్చం అలా ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఇక్క‌డ మ‌రో అంశాన్ని చెప్పుకోవాలి. ఇంత‌కీ ఈ స్వామిజీ ఎవ‌రు? ఆయ‌న ముచ్చ‌ట ఏమిటంటే.. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ముక్కామ‌ల గ్రామంలో శ్రీధ‌ర్ స్వామిజీ 20 ఏళ్లుగా ఆశ్ర‌మాన్ని న‌డుపుతున్నారు. అధ్యాత్మిక బోధ‌న‌లు చేస్తుంటారు. ఆయ‌న కుమార్తె పెళ్లి త‌ణుకు కల్యాణ‌మండ‌పంలో జ‌రిగింది.

అయితే.. ఈ తీరులో జ‌రిగిన పెళ్లి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. స్వామీజీలు అంటే స‌ర్వం త్య‌జించిన వారుగా ఉండాల్సింది పోయి..తాము దేవుళ్ల‌గా చెప్పుకునే రీతిలో పెళ్లి చేసుకోవ‌టం ఏమిట‌న్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు సంధిస్తున్నారు. ఏమైనా.. స్వామీజీ కుమార్తె పెళ్లి వేడుక‌.. దేవత‌ల పెళ్లి మాదిరి చేయ‌టం ఇప్పుడు జిల్లావ్యాప్తంగానే కాదు.. దేశంలోని ప్ర‌ముఖ మీడియాలు ఈ వేడుక ఫోటోల్ని ప్ర‌ముఖంగా అచ్చేయ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News