వర్మ మీద రెచ్చిపోయిన నాగబాబు

Update: 2023-01-11 15:30 GMT
రాం గోపాల్ వర్మ వివాదాస్పద దర్శకుడు అని అంతా అంటారు. ఆయనకు వారూ వీరూ లేదు, కాదేదీ వివాదానికి అనర్హం అన్న టైప్ లో ఆయన ప్రతీ దాని మీద గిల్లి కజ్జాలు పెట్టుకోవాలని చూస్తారని అంటారు. ఒక విధంగా వివాదాలలో నలగడం, వాటి మీద వచ్చే విమర్శలు ఏదైనా ఎంజాయ్ చేయడం వర్మ మార్క్ పాలసీ అని అనే వారూ ఉన్నారు.

వర్మ సినీ దర్శకుడు. ఆయన తన సినిమాలు తాను అని ఊరుకోకుండా తనకు సంబంధం లేని వాటి మీద కూడా రియాక్ట్ అవుతూంటాడు. ఇపుడు లేటెస్ట్ గా ఆయన పవన్ కళ్యాణ్ వెళ్లి చంద్రబాబుని కలవడం మీద హాట్ హాట్ ట్వీట్ ఒకటి చేసి పడేసారు. ఆ ట్వీట్ కమ్మలకు ఫుల్ హ్యాపీగా ఉండగా కాపులు మాత్రం రగిలిపోయేలా ఉంది. నిజానికి ఒక కులాన్ని ఇలా ముందు పెట్టి ట్వీట్ చేయడం దారుణమే.

కానీ అక్కడ ఉన్నది వర్మ కాబట్టి ఆయన ట్వీట్లకు అవేమీ తెలియదు అనుకోవాలి. కాపులను కమ్మలకు పవన్ అమ్మేశాడు అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్ తెగ వైరల్ అయింది. అంతే కాదు, కాపులకు ఆర్ ఐ పీ, కమ్మలకు కంగ్రాట్స్ అంటూ ఆయన చివరలో ఇచ్చిన ట్వైట్ కూడా మండించేలా ఉంది.

దాని మీద విజయవాడలో కాపు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. మరి జనసేన నుంచి అసలైన ఫైర్ రావాలి కదా అని అంతా అనుకున్నారు. కాస్తా లేట్ అయినా లేటెస్ట్ గా నాగబాబు నుంచి అది వచ్చింది. జనసేనలో కీలక నాయకుడిగా ఉన్న నాగబాబు ఇపుడు చాలా విషయాల మీద ఫైర్ బ్రాండ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఆయన రాం గోపాల్ వర్మ ట్వీట్ మీద ఒక రేంజిలో మండిపడ్డారు

వర్మను ఏకంగా నీచ్ కమీన్ కుత్తే అంటూ గట్టిగా తగులుకున్నాడు. అంతే కాదు వర్మ కంటే పనికి మాలిన వాడు,తెలివి తక్కువ వాడు, మూర్ఖుడు మరొకరు ఉండరని కూడా దుర్భాషలు ఆడారు. కాపు సామాజికవర్గాన్ని పవన్ అమ్మేశాడు అంటున్న వర్మకు ఏమి తెలుసు అని మండిపడ్డారు. ప్రజలను ఎవరైనా అమ్మగలరా వారి ఇష్టాలను ఎవరైనా కాదనగలరా అని ప్రశ్నించారు నాగబాబు

అది సాధ్యపడుతుందని వర్మ ఎలా భావిస్తున్నారు అని ఆయన అన్నారు. కాపు సామాజికవర్గం వారి ఇష్టానుసారం నడచుకుంటుంది అని ఆయన అన్నారు. అలాగే ప్రజలు తమకు ఎవరు కావాలనుకుంటే వారిని ఎన్నుకుంటారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్ మరియు ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీని కూడా ప్రజలే ఎన్నుకున్నారు అని ఆయన అన్నారు మరి ఆ విధంగా ఉన్న ప్రజలను వారి అభిప్రాయాలను గుత్తమొత్తంగా అమ్మేసే పరిస్థితి ఎవరికైనా ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు.

మరో వైపు చూస్తే పవన్ని ప్యాకేజి స్టార్ అని వర్మ అనడాన్ని తప్పు పట్టారు. సినిమాల్లో నటిస్తే కోట్లాదిరూపాయలు వచ్చే పవన్ కళ్యాణ్ కి ప్యాకేజీలు తీసుకోవాల్సిన ఖర్మ ఎందుకు పడుతుంది అని ఆయన ప్రశ్నించారు. ఆ మాటకు వస్తే ఆర్జీవీయే వైసీపీ నుంచి ప్యాకేజీలను తీసుకుని తమను తమ పార్టీని బదనాం చేయడానికి ఇలాంటి ట్వీట్లు పెడుతున్నారని నాగబాబు సీరియస్ అయ్యారు. మొత్తానికి వర్మ ట్వీట్ మాట ఏమో కానీ నాగబాబు నుంచి గట్టి డోసే పడిపోయింది. దీనికి వర్మ మళ్లీ రియాక్ట్ అవుతారా. వెయిట్ అండ్ సీ..


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News