గవర్నరు నరసింహన్ పదవికి కాళ్లచ్చినట్లు సమాచారం. ఏపీ, తెలంగాణలు రెండింటికీ గవర్నరుగా ఉన్న ఆయనపై ఆంధ్రప్రదేశ్ ప్రభ'ుత్వం, ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఆయన తీరుపై ఏపీ మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం.. ఆయన కేంద్రానికి ఫిర్యాదు చేయడం... కేంద్రం వారించడం... చంద్రబాబు తన మంత్రులకు సంయమనం పాటించమని చెప్పడం తెలిసిందే. ఏపీ, తెలంగాణల మధ్యి ఇప్పటికే ఉన్న వివాదాలు ఇటీవల కాలంలో తీవ్రమయ్యాయి. వీటికి తోడు ఓటుకు నోటు కేసులు, ట్యాపింగ్ లు, సెక్షన్ 8 అమలు.. ఇలా ఎన్నో చిక్కులు చుట్టుముట్టాయి. ఈ సమస్యలను పరిష్కరించడం.... ఇద్దరు సీఎంలను రాజీ చేయడంలో గవర్నరు విఫలమయ్యారన్న భావన వ్యక్తమవుతోంది. వీటన్నిటి నేపథ్యంలో నరసింహన్ గవర్నరుగిరీ ఊడనున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో బీజేపీ సీనియర్ నేత నజ్మాహెప్తుల్లాకు గవర్నరుగా బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఇది చెప్పేందుకు నరసింహన్ ను కేంద్రం ఢిల్లీకి పిలిపించుకుందని తెలుస్తోంది.
కేంద్రం నుంచి పిలుపు రావడంతో గవర్నరు నరసింహన్ ఢిల్లీ బయలుదేరారు. అక్కడ ఆయన కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో తొలుత భేటీ అవుతారని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణల్లో వ్యవహారంపై మాట్లాడుతారనీ సమాచారం. అయితే... కేంద్రం ఆయన్నుంచి రాజీనామా కోరనున్నట్లూ తెలుస్తోంది. ఆయన స్థానంలో నజ్మాహెప్తుల్లా నియామకం ఖరారైందని విశ్వసనీయ సమాచారం.