ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన గులాబీ ఎమ్మెల్యే అరెస్ట్

Update: 2019-10-04 08:41 GMT
ఆందోళనలు.. నిరసనలు.. ఏవైనా సరే వారిని అడ్డుకోవటం.. అదుపులోకి తీసుకోవటం.. అరెస్ట్ చేయటం లాంటివి ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. విపక్ష నేతల విషయంలో టీఆర్ ఎస్ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. విపక్షమే కాదు.. అధికారపక్ష నేతలైనా సరే.. ఇబ్బందులు తప్పవంటే అరెస్టులే అన్న విషయం అర్థమయ్యేలా తాజా ఉదంతం చోటు చేసుకుంది.

ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో ఓపెన్ కాస్ట్ బొగ్గుగని ఏర్పాటుపై ఈ రోజుప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. ఓపెన్ కాస్ట్ బొగ్గుగని ఏర్పాటును టీఆర్ ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకోవటానికి టీఆర్ ఎస్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఆందోళనకు దిగారు.

టీఆర్ ఎస్ కార్యకర్తలతో కలిసి భారీగా తరలి వచ్చిన ఆయన్ను పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకునే పోలీసులకు అడ్డుపడిన టీఆర్ ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ జరిపారు. దీంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓపెన్ కాస్ట్ బొగ్గు తవ్వకాలతో దాదాపు 300 గ్రామాలపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. మంత్రి హరీశ్ కూడా ఈ విషయం మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
Tags:    

Similar News