పిల్లికి చెలగాటం..ఎలుకకు ప్రాణ సంకటం అన్న సామెత అందరికి తెలిసిందే. సరిగ్గా ఇలాంటి పరిస్థితే కాకున్నా.. ఇంచుమించు ఇలాంటి పరిస్థితే కేంద్రం పుణ్యమా అని నెలకొంది. రాష్ట్రాలు ఏం అడిగినా సరే.. తమకు నచ్చితే ఇస్తామనటం.. లేదంటే హ్యాండ్ ఇవ్వటం ఈ మధ్యన ఎక్కువైంది. దీనికి తోడు.. రాష్ట్రాలు అడిగే డిమాండ్లను నెరవేర్చే విషయంలో మోడీసర్కారు అనుసరిస్తున్న తీరును పలు రాష్ట్రాలు తప్పు పడుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎంపీ నామా నాగేశ్వరరావు కాసింత ఘాటుగా రియాక్టు అయ్యారు.
సోమవారం పుట్టిన రోజైన నామా.. తన సూటి ప్రశ్నలతో సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రైలు మార్గాలపై రోడ్ ఓవర్ బ్రిడ్జి.. రోడ్ అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి యాభై శాతం నిధులు రాష్ట్రం వెచ్చించాలని చెప్పటం సరికాదని నామా చెబుతున్నారు. వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వాటిని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. రైల్వే పద్దులపై లోక్ సభలో సోమవారం చర్చ జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన నామా..తన నియోజకవర్గంలోని మధిరలో ఆర్వోబీ నిర్మాణంపై రైల్వే శాఖకు లేఖ రాస్తే.. ‘‘పరిగణలోకి తీసుకున్నాం.. మీరు నిధులు ఇవ్వండి’’ అని తిరిగి లేఖ పంపారన్నారు. తాము నిధులు ఇస్తే.. మీరు పరిగణలోకి తీసుకోవటం ఏమిటని ఘాటుగా ప్రశ్నించారు నామా. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ నవ్వుతూ కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ వైపు చూశారు. ఇదే విషయాన్ని గమనించిన నామా.. రైల్వే మంత్రి.. ఆర్థికశాఖ సహాయ మంత్రి పక్కపక్కనే కూర్చున్నందున ఇరువురు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రావాలని కోరారు.
తాను నియోజకవర్గానికి వెళ్లినప్పుడు.. ఎంపీగా ఉన్నారు.. ఒక్క ఆర్వోబీ.. ఆర్ యూబీ తేలేకపోతున్నారు.. మీరేం ఎంపీ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని నామా పేర్కొన్నారు. అంతేకాదు.. విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చటం లేదన్న ఆయన.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై పార్లమెంటులో చట్టం చేస్తే.. దానిని తిరస్కరించినట్లుగా చెబుతున్నారన్నారు. అలా చేస్తే.. సభపై ప్రజలకు విశ్వాసం పోతుందన్నారు. రాష్ట్రంలో పలు రైల్వే మార్గాలకు నిధులు అడిగినా పట్టించుకోవటం లేదన్నారు. రైల్వే బడ్జెట్ లో కేటాయింపులు.. అంచనా వ్యయం.. రెవెన్యూ మధ్య రూ.లక్ష కోట్ల తేడా ఉందని.. దాన్ని ఎలా అధిగమిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. నామా మాట్లాడిన సందర్భంగా సభాధ్యక్ష స్థానంలో కూర్చున్న రమాదేవి మాట్లాడుతూ.. బాగా మాట్లాడారంటూ ప్రశంసలు ఇవ్వటం గమనార్హం.