కరాచీ బేకరీ పేరు మార్పు.. ఇక ఈ పేరే..

Update: 2019-02-27 11:12 GMT
పుల్వామాలో భారత సైనికులపై పాక్ ప్రేరేపిత ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ అన్నా.. ఆ దేశ పేర్లున్న సంస్థలన్నా భారతీయులు ఈసడించుకుంటున్నారు. వారి ఆనవాళ్లు కనిపిస్తే చాలు దాడులు చేయడమో.. ఆందోళన చేయడమో చేస్తున్నారు.

ఈ కోవలోనే భారత దేశంలో విస్తరించిన ప్రముఖ బేకరీ బ్రాండ్ ‘కరాచీ బేకరీల’కు చిక్కొచ్చింది. దేశంలోని హిందుత్వ సంస్థలు, వివిధ వర్గాల ప్రజలు కరాచీ బేకరీలకు బెదిరింపులు చేశారు. పేరు తొలగించాలని పలుచోట్ల దుకాణాల ముందు ఆందోళన చేశారు.  దీంతో కరాచీ బేకరీల వద్ద సెక్యూరిటీని పోలీసులు పెంచారు.

అయితే కరాచీ మాత్రం తాము అచ్చ భారతీయ సంస్థ అంటూ మూలాలను చెప్పే ప్రయత్నం చేసింది. అయినా భారతీయులు కొందరు ఊరుకోలేదు. దీంతో పేరు మార్పుపై కరాచీ బేకరీ సంస్థ నిర్ణయం తీసుకుంది.

ఇక పై కరాచీ బేకరీలను ‘ఇండియన్ కరాచీ’లుగా మారుస్తున్నట్టు సంస్థ తెలిపింది. హైదరాబాద్ లోని మొజంజాహీ మార్కెట్ లో ఉన్న కరాచీ బేకరీ యాజమానాన్ని తాజాగా కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ ఆధ్వర్యంలోని బీజేపీ నేతలు సంప్రదించగా ఈ మేరకు హామీ ఇచ్చింది. రెండు రోజుల్లో ఇండియన్ కరాచీ బేకరీ పేర్లు పెడుతామని యాజమాన్యం తెలిపినట్లు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీనివాసయాదవ్ ప్రకటించారు.
Tags:    

Similar News