గుడివాడకు నందమూరి మహిళ

Update: 2023-01-17 09:00 GMT
తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలవడాన్ని అత్యంత ప్రతిస్థ్టాత్మకంగా తీసుకుంటోంది. దాంతో పాటు కొన్ని చోట్ల ప్రత్యర్ధులను ఓడించి తీరాలని పట్టుదలగా ఉంది. దానికోసం కొన్ని సీట్లను టార్గెట్ గా పెట్టుకుంది.  అందులో చూస్తే గుడివాడ ఒకటి అని అంటున్నారు. చంద్రబాబు ఫ్యామిలీ మీద వ్యక్తిగత విమర్శలు చేయడంతో పాటు బాబుని లైట్ తీసుకుంటూ తనదైన శైలిలో మంత్రిగా మాజీ మంత్రిగా కొడాలి నాని చేసిన దూకుడుతో టోటల్ టీడీపీయే హర్ట్ అయింది అని అంటున్నారు.

అందువల్ల వచ్చే ఎన్నికల తరువాత అసెంబ్లీలో కొడాలి నాని ఫేస్ ని చూడకూడదు అని తమ్ముళ్ళు డిసైడ్ అయ్యారుట. ఇక చంద్రబాబు అయితే కొడాలి నాని ఓటమి కోసం చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు అని అంటున్నారు. కొడాలి నానిని ఓడించడం కోసం సరైన క్యాండిడేట్ ని గుడివాడలో దింపాలని తెలుగుదేశం గట్టి కసరత్తునే చేస్తోంది అని అంటున్నారు.

కొడాలి నాని కూడా మామూలు క్యాండిడేట్ కాదు. 2004 నుంచి అక్కడ పట్టు సాధించారు. ఇప్పటికి నాలుగు దఫాలుగా గెలిచి రెండు దశాబ్దాల ఎమ్మెల్యే అనిపించుకున్నారు. ఇక మంత్రిగా కూడా పనిచేశారు. తనకంటూ ఒక బలమైన వర్గాన్ని అక్కడ ఏర్పాటు చేసుకుని తెలుగుదేశాన్ని ఢీ కొడుతున్నారు. దాంతో నాని మీద పోటీకి పెట్టాలీ అంటే ప్రస్తుతం గుడివాడకు ఉన్న ఇంచార్జి సరిపోరు అని తెలుగుదేశం అధినాయకులు ఆలోచిస్తున్నారుట.

అంతే కాదు తాజాగా తెలుగుదేశం జరిపిన సర్వేలో కూడా నానికి ఢీ కొట్టాలి అంటే ప్రస్తుత ఇంచార్జి ఏ మాత్రం తూగలేరు అని నివేదిక వచ్చిదని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో నందమూరి బ్లడ్ ని రంగంలోకి దింపితేనే కొడాలి నానికి సరైన జవాబు చెప్పినట్లు అవుతుంది అని లెక్కలేస్తున్నారుట. మరో వైపు చూస్తే కొడాలి నాని మీద మగవారిని అభ్యర్ధిగా పెడితే ఆయన అగ్రెస్సివ్ మూడ్ తో అటాక్ చేస్తారు.

కానీ నందమూరి ఫ్యామిలీ లేడీని బరిలోకి దించితే నాని దూకుడుగా ప్రత్యర్ధి మీద కామెంట్స్ చేయలేరు అని తెలుగుదేశం సరికొత్త ఎత్తు వేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇది లోకేష్ మార్క్ ఆలోచనగా అంటున్నారు. మరి నందమూరి ఫ్యామిలీలో ఆ మహిళ ఎవరు అన్నదే ఇపుడు చర్చగా ఉంది. అంత పెద్ద స్థాయిలో పొలిటికల్ గా ప్రభావం చూపించే మహిళ ఎవరు అన్నదే అందరి మదిలో మెదిలే ఆలోచనగా ఉంది.

అయితే నందమూరి కుటుంబం నుంచి ఒక పవర్ ఫుల్ లేడీ ఇపుడు కావాలి. కొడాలి నానిని టార్గెట్ చేసి ఓడించాలి అంటే నందమూరి నారి మాత్రమే సరిపోతుంది అన్న లెక్కలతొనే ఈ పనిని నందమూరి బాలకృష్ణకు అప్పగించారు అని అంటున్నారు. మరి నందమూరి ఫ్యామిలీ లో ఎవరు అంతటి నాయకులు ఉన్నారు అన్నది కనుక ఆరా తీస్తే రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వారు దివంగత నందమూరి హరిక్రిష్ణ కుమార్తె నందమూరి సుహాసిని ఉన్నారు.

ఆమె గతంలో అంటే 2018లో కూకట్ పల్లి నుంచి పోటీ చేసి ఓడారు. ఆమె ఇపుడు ఏపీ రాజకీయల పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అయితే ఆమె సాఫ్ట్ నేచర్ తో ఉంటారు. ఆమె పెద్దగా ఫోకస్ అయిన దాఖలాలూ లేవు. అప్పట్లో ఆపద్ధర్మంగా కూకట్ పల్లిలో ఆమెను పోటీకి నిలబెట్టారు కానీ ఏపీలో అందునా గుడివాడలో ఆమెను తెస్తే కొడాలి నానిని ఢీ కొడతారా అన్నది కూడా ఆలోచించాల్సిందే అంటున్నారు.

ఇక పోతే  బాలకృష్ణ  అక్క పురంధేశ్వరి ఉన్నారు. ఆమె ధీటైన నాయకురాలే. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అందువల్ల ఆమెని తెచ్చి గుడివాడలో పోటీకి దించితే గట్టి పోటీ ఇవ్వవచ్చు. కానీ ఆమె తెలుగుదేశం పార్టీలోకి వస్తారా అన్నదే చర్చగా ఉంది. ఆమె బీజేపీలో ఒక హోదాలో ఉన్నారు. ఆశలు అన్నీ ఆ పార్టీ మీద పెట్టుకున్నారు. తెలుగుదేశంలోకి వస్తే జస్ట్ గెలిచినా ఎమ్మెల్యే మాత్రమే అవుతారు. మంత్రి కూడా దక్కదు. దాంతో ఆమె రారు అనే అంటున్నారు.

మరో వైపు చూస్తే బ్రాహ్మణి ఉన్నారు. ఆమె లోకేష్ సతీమణి. ఆమెను తెచ్చి పోటీకి పెట్టాలీ అనుకుంటే ఆమె అంగీకరిస్తారా అన్నది చూడాలి. ఆమె పోటీకి దిగితే మంచి పోటీ ఇవ్వగలరు. ఎందుకంటే ఆమె బాలయ్యకు కుమార్తె. లోకేష్ కి సతీమణి, చంద్రబాబుకు కోడలు. అందువల్ల ముగ్గురు ప్రభావం కూడా ఆమె మీద పడి కొడాలి నానికి గట్టిగానే పోటీ ఇవ్వగలరు. కానీ ఆమె రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు అంటున్నారు. మరి ఎవరు ఆ నందమూరి నారి అంటే తెలుగుదేశంలో దీని మీద మధనం సాగుతోంది. చూడాలి మరి ఎవరు ఆ మహిళా నేత అన్నది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News