ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఘోరంగా ఉందని ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వాపోయారు. అంత ఘోరంగా ఉంది కాబట్టే ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చలేకపోతున్నామని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. నిజంగా ఆర్థిక పరిస్థితి బాగుంటే ఇంత మందితో ఎందుకు గొడవ పెట్టుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు.
సచివాలయం రెండో బ్లాక్ లో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన మంత్రి పేర్ని నాని బయటకు వచ్చి తనను కలిసిన మహిళా ఉద్యోగులు, జర్నలిస్టుల వద్ద అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఐఆర్ 27శాతం ఇచ్చి ఫిట్ మెంట్ 23 శాతానికి తగ్గించడమేంటని మంత్రి నానిని ఉద్యోగులు ప్రశ్నించగా ఆయనో పిట్టకథ చెప్పారు.
‘కొడుకు పదోతరగతిలో చేరినప్పుడు ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటే స్కూట్ కొనిస్తానని తండ్రి మాట ఇస్తాడు. తీరా ఫస్ట్ క్లాస్ లో పాసయ్యేసరికి ఆ తండ్రి దివాళా తీశాడు. మానాన్న స్కూట్ కొనిస్తానని ఇవ్వలేదని కొడుకు తిట్టుకుంటే మాత్రం ఆయన ఏం చేయగలడు.. ప్రభుత్వం పరిస్థితి ఇలాగే ఉంది. రాష్ట్రంలో 1.57 కోట్ల తెల్ల రేషన్ కార్డు దారులున్నారు. వారంతా కూడా ఉప్పు, పప్పు కొని ప్రభుత్వానికి జీఎస్టీ కడుతున్నారు కదా? వాళ్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది కదా.? మరి ప్రభుత్వం వాళ్లకేమీ చేయవద్దా? ప్రభబుత్వానికి వచ్చే ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలు, తెచ్చిన అప్పులపై వడ్డీలు కట్టడానికే సరిపోతే.. మరి వాళ్ల సంక్షేమానికి ఎక్కడ నుంచి తేవాలి? నిబంధనల ప్రకారం ప్రస్తుతం 40వేల కోట్లు మాత్రమే తేగలం’ అని ఏపీ మంత్రి నాని ఏపీ ఆర్థిక పరిస్థితిపై అసలు విషయాన్ని బయటపెట్టారు.
ఈ క్రమంలోనే ఉద్యోగులే పెద్ద మనసు చేసుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకొని మసలాలని మంత్రి నాని హితబోధ చేశారు. ఇది మనసుకు సంబంధించిన అంశం కాదని.. గల్లాపెట్టేతో ముడిపిన అంశమని.. జీతాలు కనీసం ఇవ్వాలంటే రాజీపడాలని స్పష్టం చేశారు. రెండు రూపాయలకు వడ్డీ తెచ్చి తీరా రుణం తీర్చకపోతే వడ్డీ తగ్గించండంటూ బతిమిలాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన పేర్కొన్నారు.