బ్రాహ్మ‌ణి రోటీన్‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించారుగా!

Update: 2018-01-17 04:21 GMT
సంక్రాంతి పండ‌క్కి సొంతూరు నారావారిప‌ల్లెకు చంద్ర‌బాబు కుటుంబం మొత్తం త‌ర‌లివెళ్ల‌టం తెలిసిందే. పండ‌గ మొద‌ల‌య్యే రోజు నుంచి నారావారిప‌ల్లెలో ఉన్న వారు.. వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఈ పండ‌గ‌లో స్పెష‌ల్ ఏమిటంటే.. బాబు ఫ్యామిలీలో ఇద్ద‌రు స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచారు.

బాబు మ‌న‌మ‌డు.. లోకేశ్ కొడుకు దేవాన్ష్ అంద‌రిలోకి స్పెష‌ల్ అయ్యాడు. ఇద్ద‌రు తాత‌లు చంద్ర‌బాబు.. బాల‌య్య‌లు మ‌న‌మ‌డ్ని వెంట బెట్టుకొని ఉండ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. సంప్ర‌దాయ దుస్తులు ధ‌రించిన మ‌న‌మ‌డ్ని తీసుకొని నారావార పల్లెలో ఎడ్ల బండి మీద ఊళ్లో తిర‌గ‌టం ఈ సంక్రాంతి స్పెష‌ల్ గా చెప్పాలి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. అంద‌రిలో ఒక‌రిగా ఉండిపోయే బ్రాహ్మ‌ణి.. ఈసారి అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా చెప్పాలి. కొడుకు దేవాన్ష్ ను తీసుకొని ఎడ్ల బండి నారావారి ప‌ల్లె వీధుల్లో తిరిగారు. బ్రాహ్మ‌ణి ఇలా ఎడ్ల బండి ఎక్క‌టం ఈ మ‌ధ్య కాలంలో చూడ‌లేద‌ని చెబుతున్నారు. ఏమైనా.. బ్రాహ్మ‌ణి ఇలా కొడుకును తీసుకొని బ‌య‌ట‌కు రావ‌టం.. ఎడ్ల బండి ఎక్కి ఎంజాయ్ చేసిన తీరు అంద‌రిని ఆక‌ట్టుకుంది. మొత్తానికి సంక్రాంతి సంబ‌రాల‌కు సొంతూరుకు వ‌చ్చిన చంద్ర‌బాబు ఫ్యామిలీలో.. దేవాన్ష్‌.. బ్రాహ్మ‌ణి సో స్పెష‌ల్ గా నిలిచారు.
Tags:    

Similar News