జె- బ్రాండ్స్ కి వ్యతిరేకంగా రెండ్రోజుల ధర్నా - చంద్రబాబు

Update: 2022-03-19 01:30 GMT
ముఖ్యమంత్రి  జ‌గ‌న్‌ది ధనదాహంతో కూడిన ప‌రిపాల‌న‌ని, అందుకే మహిళల తాళిబొట్లు సైతం తెంచుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. 'కల్తీ సారా అరికట్టాలి జె. బ్రాండ్స్ మద్యం నిషేధించాలి' అనే డిమాండ్తో రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. మద్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ.. గ్రామ స్థాయి నేతలు, క్యాడర్కు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు రాష్ట్రంలోనే ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. మద్య నిషేధం చేస్తానని చెప్పిన జగన్.., సొంత బ్రాండ్లతో మహిళల తాళిబొట్లు తెంచుతున్నారని మండిపడ్డారు. జగన్ తెచ్చిన కొత్త బ్రాండ్లు స్లో పాయిజన్ గా మారి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని ఆరోపించారు. మద్యం ద్వారా ఏడాదికి ప్రజల జేబుల నుంచి 5 వేల కోట్లు కాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క మద్యం ద్వారానే... కమిషన్ల రూపంలో 25 నుంచి 30 వేల కోట్ల రూపాయలు కాజేస్తున్నారని ఆరోపించారు.

తెలుగుదేశం ముఖ్యనేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కల్తీ సారా, జె- బ్రాండ్స్ మద్యానికి వ్యతిరేకంగా రేపు, ఎల్లుండి టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.  కాగా, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ మాట్లాడుతూ.. 'వీవోఏ నాగ‌ల‌క్ష్మిది ఆత్మహ‌త్య కాదు.. జ‌గ‌న్ రెడ్డి పార్టీ నేత చేసిన హ‌త్య' అని అన్నారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం భోగి రెడ్డి పల్లి వీవోఏ నాగలక్ష్మి.. తాము చెప్పిన‌ట్టు విన‌డంలేద‌ని వైసీపీ నేత నరసింహారావు వెంటాడి వేధించ‌డంపై ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు చ‌ర్యలు తీసుకుని ఉంటే ఆమె బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్పడేది కాదన్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా వైసీపీ నేత నుంచి మ‌హిళను ర‌క్షించ‌లేక‌పోయారంటే.. రాష్ట్రంలో పోలీసు వ్యవ‌స్థ ఎంత‌గా భ్రష్టు ప‌ట్టిందో తెలుస్తుందని లోకేశ్ విమర్శించారు. ముఖ్యమంత్రి.. మీకు ఓట్లేసి గెలిపించింది ప్రజ‌ల‌కి ర‌క్షకులుగా ఉంటార‌ని.. ప్రజ‌ల్నే భ‌క్షిస్తార‌ని కాదని ధ్వజమెత్తారు.

సొంత చెల్లెలిని తెలంగాణ త‌రిమేసి, బాబాయ్ని చంపేసి ఆయ‌న కుమార్తె ప్రాణాల‌కు ర‌క్షణ‌లేకుండా చేసిన జ‌గ‌న్‌రెడ్డిని ఆద‌ర్శంగా తీసుకుని గ్రామ‌స్థాయిలోనూ వైసీపీ నేత‌లు మ‌హిళల‌ ప్రాణాలు తీసేస్తున్నారని మండిపడ్డారు. చ‌ట్టాన్ని చుట్టంగా చేసుకున్న వైసీపీ నేత‌ల అరాచ‌కాల‌కు పోలీసుల‌కు అండ‌గా ఉన్న ప‌రిస్థితుల్లో ప్రజ‌లంతా క‌లిసి తిరుగుబాటు చేయాలని.. అప్పుడే ప్రజ‌ల ధ‌న‌మాన ప్రాణాల‌కు ర‌క్షణ దొరుకుతుందని లోకేశ్ స్పష్టం చేశారు.
Tags:    

Similar News