బాబులో కట్టలు తెంచుకున్న ఆవేశం...?

Update: 2022-03-25 02:30 GMT
చంద్రబాబును ఎక్కడ కెలకాలో అక్కడే కెలికారు వైసీపీ పెద్దలు. అంతే ఆయన కట్టలు తెంచుకున్న ఆవేశంతో ఊగిపోయారు. అసెంబ్లీలో అయితే బాబు మాట్లాడడానికి మైకులు ఇవ్వరు. కానీ బయట ఆయన పిలిస్తే మీడియా రాదా. అందుక ఇలా అసెంబ్లీలో జగన్ అమరావతి రాజధాని మీద ప్రసంగం చేశారో లేదో అలా బాబు కౌంటర్ ఇచ్చేశారు.

అది కూడా  ఫుల్  స్ట్రాంగ్ గా. సవా లక్షల ప్రశ్నలతో కూడిన హెవీ డోస్ అది. ఇందులో పాయింట్లన్నీ లాజిక్ గానే ఉన్నాయి. మొదటిది తీసుకుంటే ఆనాడు అమరావతి రాజధానికి జగన్ విపక్ష నేతగా మద్దతు ఇచ్చారా లేదా. అంతే కాదు, ముప్పయి వేల ఎకరాల భూములు కావాలన్నారా లేదా. ఇది స్ట్రైట్ క్వశ్చన్ టూ జగన్.

అదే విధంగా రాజధాని ఎంపిక అన్నది రాష్ట్రాల నిర్ణయమే. అది అమరావతిగా నాటి సర్కార్ డిసైడ్ చేసింది. మళ్ళీ దాన్ని మార్చాలీ అంటే మాత్రం కేంద్ర అనుమతి ఉండాలి. ఇది బాబు గారి లాజిక్ పాయింట్.

మూడవ విషయం తీసుకుంటే చట్ట సభలకు చట్టాలు చేసే అధికారాలు ఉన్నాయి. కానీ జనాలను చంపేస్తామని చట్టాలు చేస్తే కుదురుతుందా. మంద బలం ఉంది కదా అని ఏది పడితే అది చట్టం చేస్తే అమలు అవుతుందా. రాజ్యాంగం ప్రకారమే చట్టాలు ఉండాలి. అంతే కాదు, చట్టాలు చేసేటపుడు రాష్ట్రాలు, కేంద్ర అధికారాల పరిధులు తెలుసుకుని చేయాలి. ఇది బాబు మరో లా పాయింట్.

అలాగే చూసుకుంటే వికేంద్రీకరణ అంటూ తెగ గోల చేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు పాలనా వికేంద్రీకరణకు మధ్య తేడా తెలియని ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ ప్రభుత్వంలో ఉన్నారని చంద్రబాబు ఏకంగా  ఘాటైన పదజాలమే ఉపయోగించారు. అంటే వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి తప్ప ఊరికో  రాజధాని పెట్టడం కాదు మిష్టర్ జగన్ అని బాబు అంటున్నారు.

వీటన్నింటికీ మించి మీకు ప్రజలు అధికారాన్ని ఇచ్చారని ఏపీని ఏం చేయలనుకుంటున్నారు. భావి తరాల క్షేమం మీకు అవసరం లేదా. విద్వంస పాలన చేస్తారా, మీ పంతమే ముఖ్యమా. ఆఖరుకు హై కోర్టు తీర్పులను కూడా తప్పు పడతారా ఇలా బాబు జగన్ సర్కార్ ని మీడియా ముఖంగా చెడుగుడే ఆడేశారు.

చివరిగా ఆయన ఏమన్నారంటే ఏపీకి శనిగ్రహం మాదిరిగా వైసీపీ సర్కార్ దాపురించిందని. మీకు మూడు రాజధానుల మీద అంత ముచ్చటగా ఉంటే తక్షణం అసెంబ్లీని రద్దు చేసుకుని ఎన్నికలకు సిద్ధం కావాలని చంద్రబాబు భారీ సవాల్ విసిరారు. మొత్తానికి అసెంబ్లీలో జగన్ స్పీచ్ కి బిగ్ సౌండ్ తో బాబు ఇచ్చిన కౌంటర్ కూడా అదిరింది అనే అంటున్నారు.
Tags:    

Similar News