చంద్రబాబులో కొత్త కళ కనిపిస్తోంది. అధికారం కోల్పోయి మూడేళ్ల తరువాత ఆయనలో సరికొత్త ధీమా కూడా బయటపడుతోంది. ఈ మధ్య ఆయన పార్టీ నాయకుల సమీక్షా సమావేశాల్లో మాట్లాడుతున్నా లేక మీడియా ముందు మాట్లాడుతున్నా కూడా ఎక్కడలేని ఆత్మ విశ్వాసం పొడసూపుతోంది. మరి చంద్రబాబు ఫుల్ జోష్ లో ఉండడానికి కారణం ఏంటి అంటే ఏపీలో వైసీపీ మీద జనాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత చెలరేగుతోందన్న సమాచారం దగ్గర ఉండడమేనట.
తెలుగుదేశం ఎప్పటికపుడు సర్వేలు చేయిస్తూ వస్తోంది. దాదాపుగా ప్రతీ రెండు మూడు నెలలకూ మారిన పరిస్థితులను తీసుకుని జనాల్లోకి వెళ్తోంది. ఇక గత ఆరు నెలలుగా చూస్తే వైసీపీ పట్ల అంతకంతకు వ్యతిరేకత పెరుగుతోందని టీడీపీకి శుభవార్తలే వస్తున్నాయట.
దానికి తోడు అమరావతి రాజధాని విషయంలో హై కోర్టు ఇచ్చిన తీర్పు జగన్ తప్పుడు విధానాలకు చెంపపెట్టు అని టీడీపీ పెద్దలు భావిస్తున్నారుట. ఏపీని అభివృద్ధి చేయడం చేతగాక మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడాలని చూశారని, చివరికి అది న్యాయ సమీక్షలో వీగిపోయిందని కూడా అంటున్నారు.
ఇక మూడేళ్ల కాలం ముగిసినా అభివృద్ధి అన్నది ఏపీలో లేకపోవడం పట్ల జనాలల్లో వస్తున్న నిరసన కూడా టీడీపీకి అడ్వాంటేజ్ గా మారుతోంది అంటున్నారు. అదే సమయంలో వివిధ వర్గాలతో ప్రభుత్వం పెట్టుకున్న పేచీలు వికటించి అవన్నీ కూడా పూర్తి యాంటీగా మారాయని లెక్కలు కడుతున్నారు. మొత్తానికి చూస్తే వచ్చే ఎన్నికలు తమకు క్యాట్ వాక్ గా ఉంటాయని టీడీపీ ధీమా గా ఉంది.
ఇదే విషయం చంద్రబాబులో కూడా పూర్తి సంతోషాన్ని నింపుతోంది. పైగా జగన్ గురించి గతంలో తాము జనాలకు చెబితే నమ్మే సీన్ లేదని, ఇపుడు ఆయన పాలన చూశాక జనాలకు చెప్పాల్సిన అవసరం కూడా లేదని టీడీపీలో పెద్దలు అనుకుంటున్న మాటగా ఉందిట.
ఇక జగన్ విషయంలో జనాలకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి వెల్లువలా వచ్చే వ్యతిరేకతే తిరిగి తనను సీఎం సీట్లోకి తెస్తుందని బాబు కచ్చితమైన నమ్మకంతో ఉన్నారని అంటున్నారు. అందుకే ఆయన వచ్చేది తమ ప్రభుత్వమే అని క్యాడర్ కి కూడా గతానికంటే కూడా ఎక్కువ ధీమాతో చెప్పగలుగుతున్నారు.
జగన్ ఒక్క చాన్స్ అని అడిగితే జనాలు కూడా ఒకే ఒక్క చాన్స్ ఇచ్చారని, ఇక మీదట వైసీపీ వలలో పడేవారు ఎవరూ ఉండరని కూడా భావిస్తున్నారుట. మొత్తానికి వచ్చే ఎన్నికలు అన్నవి టీడీపీకి విజయాన్ని అందించేందుకు మాత్రమే అన్న భావన అయితే బాబులో నిండుగా ఉంది. దాన్ని ఆయన పార్టీ నాయకులు, క్యాడర్ కి కూడా నూరిపోస్తున్నారు. అదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేయడం అన్న ఒక్క లాంచనం తప్ప 2024లో గెలిచేది, వచ్చేది తమ పార్టీయే అని ఆయన తలపోస్తున్నారుట.
మొత్తానికి చంద్రబాబు లో ఇంతటి జోష్ రావడం ఆ పార్టీకి మంచిదే కానీ, అతి ధీమా కూడా మంచిది కాదేమో అన్న చర్చ కూడా ఉంది. ఎన్నికలు ఎపుడూ కొత్త పాఠాలే చెబుతాయి. అక్కడ అంకెల గారడీ సాగుతుంది. ఒక్క ఓటుతో జాతకాలూ మారుతాయి. అందువల్ల ధీమా ఆత్మవిశ్వాసంతో పాటు పార్టీ క్యాడర్ ని కూడా రెడీ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు. అలాగే క్షేత్ర స్థాయి పర్యటనలు కూడా టీడీపీ అధినాయకత్వం ప్రారంభించాలని కూడా అంటున్నారు. సో చంద్రబాబు కాబోయే సీఎం అన్నది మాత్రం టీడీపీలో ఈ రోజు గట్టిగా వినిపిస్తున్న మాట.