అమరావతిని అతిగా సపోర్ట్ చేస్తే.. అటు ఉత్తరాంధ్రలోనూ, ఇటు రాయలసీమలోనూ నష్టం కలుగుతుందనే రాజకీయ అంశాన్ని తెలుగుదేశం పార్టీ పట్టించుకోవడం లేదు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంత టీడీపీ నేతలతో కూడా అమరావతి అనుకూల ప్రకటనలు చేయిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. అక్కడ రాజకీయంగా నష్టం కలిగినా ఫర్వాలేదు, అమరావతిని మాత్రం మార్చడానికి వీల్లేదన్నట్టుగా తెలుగుదేశం వ్యవహరిస్తూ ఉంది. ఇలాంటి క్రమంలో ఈ పోరాటంలో తెలుగుదేశం పార్టీ చాలా ముందుకే వెళ్తోందట!
ఇప్పటికే అమరావతి పోరాటంలోకి చంద్రబాబు నాయుడి సతీమణి కూడా దిగారు. ఎప్పుడో చంద్రబాబు నాయుడు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏవైనా దీక్షలు చేస్తే అక్కడ భువనేశ్వరి కనిపించేది. ఆ తర్వాత ఆమె చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఆయన భార్య హోదాలో కనిపించారు. ఇప్పుడు ఒక ప్రత్యక్ష నిరసనకే ఆమె దిగుతున్నారు.
అంతే కాదట.. ఇప్పుడు మరో ఆసక్తిదాయకమైన సమాచారం అందుతూ ఉంది. అదేమిటంటే.. అమరావతి కోసం నారా లోకేష్ బాబు నిరాహార దీక్షకు దిగబోతున్నారట. ఆయన నిరాహార దీక్షకు దిగి.. మూడు రాజధనులను వ్యతిరేకించబోతున్నారట. అమరావతి మాత్రమే రాజధాని ఉండాలని, కర్నూలు- విశాఖలకు అవకాశం ఇవ్వకూడదని నారా లోకేష్ ఉద్యమించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే కాగడాల ప్రదర్శన వంటి వాటిల్లో లోకేష్ కనిపించారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తూ.. నిరాహార దీక్షకే దిగబోతున్నాడట చంద్రబాబు నాయుడి తనయుడు. అదే జరిగితే.. ప్రతిపక్ష వాసంలో లోకేష్ చేయబోయే మొదటి దీక్ష అదే అవుతుంది. కానీ దాని వల్ల అమరావతి కి ఏకైక రాజధాని హోదా మిగులుతుందో లేదో కానీ తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో మాత్రం తీవ్రమైన నష్టం కలగడం ఖాయం.