టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తనయుడిగానే కాకుండా మొన్నటిదాకా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు భుజానికెత్తుకుని, ఇటీవలే మరింత కీలకమైన మంత్రి పదవిని స్వీకరించిన నారా లోకేశ్ పై నిత్యం విమర్శలు రేకెత్తుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి లోకేశ్ చేస్తున్న ప్రసంగాల్లో దొర్లుతున్న తప్పులను ఆసరా చేసుకుని సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న లోకేశ్ కు మరో విచిత్ర పరిస్థితి ఎదురైంది.
తన తండ్రి చంద్రబాబు అమెరికా పర్యటనకు బయలుదేరగా... నిన్న ఒక్క మంత్రి కూడా సెక్రటేరియట్ కు రాకపోగా... లోకేశ్ ఒక్కరే తన కార్యాలయానికి వచ్చి తన విధుల్లో నిమగ్నమయ్యారు. అయితే కాస్తంత బడలిక తీర్చుకుందామనుకున్నారో, ఏమో తెలియదు గానీ... ఆయన శాసనమండలి చైర్మన్ చక్రపాణిని కలిసేందుకు బయలుదేరారు. మండలి చైర్మన్ కార్యాలయానికి వెళ్లిన లోకేశ్... అక్కడ చక్రపాణిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. పనిలో పనిగా తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని లోకేశ్ కు వివరించిన చక్రపాణి... చివరగా ఎలా నడుచుకుంటే భవిష్యత్తు బాగుంటుందన్న విషయంపై లోకేశ్ కు సలహా ఇచ్చేశారు.
ఆ సలహా విన్న లోకేశ్ సుదీర్ఘమైన ఆలోచనలో పడ్డారని టాక్. అయినా... లోకేశ్ కు చక్రపాణి చేసిన సలహా ఏంటంటే... కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చే ఏ పని కూడా చేయొద్దని చెప్పారట. పదవుల్లో ఉన్నపుడు జనం, మీడియా మనల్ని దగ్గరగా గమనిస్తారని, పనికి, మాటకు ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి విమర్శలను తెలివిగా తప్పించుకోవడం అలవరుచుకోవాలని సూచించారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/