ఏపీ సీఎం చంద్రబాబు పుత్రరత్నం - ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు ప్రతిభాపాటవాల గురించి ఇప్పటికే పుటలు పుటలుగా చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. జయంతిని వర్ధంతి చేయడం మొదలుకొని మొన్నటికి మొన్న తేట`తెలుగు`కోసం స్పెషల్ క్లాసులు పెట్టించుకోవడం వరకు చినబాబు స్పెషాలిటీనే వేరు. అమాత్యులు ఏం చేసినా సరే అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా, లోకేష్ బాబు మరోసారి వార్తల్లో నిలిచారు. విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న చినబాబు....మరోసారి ప్రజలపై నోరుజారారు. తమకు న్యాయం చేయాలంటూ గోడు వెళ్లబోసుకున్న అగ్రిగోల్డ్ బాధితులపై చినబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమ సమస్యకు పరిష్కారం ఎప్పుడు చూపిస్తారంటూ...నిలదీసిన ప్రజలపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ``నువ్వాగరా... ఆమె మాట్లాడుతుంటే నీకెందుకురా దురద....నే చెబుతున్నా కదా`` అంటూ బాధితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మాట్లాడేటపుడు చెప్పిందే వినాలని....వాదనలు చేయకూడదని లోకేష్ హుకుం జారీ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది.
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని చెప్పి చాలా రోజులయిందని, ఇప్పటికీ న్యాయం జరగలేదని బాధితులు లోకేష్ ను ప్రశ్నించారు. దీంతో, వారిపై చినబాబు అసహనం వ్యక్తం చేస్తూ సమాధానమిచ్చారు. ప్రతి కేబినెట్ మీటింగ్ లోనూ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబుగారు చర్చిస్తున్నారని అన్నారు. చాలా కాలం నుంచి ఇలాగే చెబుతున్నారని నిలదీసిన మహిళలపై లోకేష్ మండిపడ్డారు. ``చెప్పేది విను....నన్నేం చేయమంటావు...ఇది తప్పు ....చెప్పేది వినమ్మా....విను....వాదన చెయ్యడం కరెక్ట్ కాదు......పరిష్కారం చేస్తామని చెప్పానా....చెయ్యనివ్వండి``అంటూ అసహనం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందంటూ అక్కడ నుంచి లోకేష్ ఉడాయించారు. చినబాబు తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించకపోగా కనీసం సమాధానం కూడా సరిగా ఇవ్వడం లేదంటూ మండిపడుతున్నారు. బాధ్యత గల మంత్రి హోదాలో ఉన్న లోకేష్...ఇలా మాట్లాడడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
వీడియో కోసం క్లిక్ చేయండి
Full View