అబద్ధాలతో ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేయడమే కాకుండా... తప్పు చేసి సారీ అడగడం అనేది తెలుగుదేశం నాయకుల నుంచే నేర్చుకోవాలి. ఒక ఎంపీ - ప్రధానికి నమస్కారం చేయడాన్ని దేశద్రోహంగా చిత్రించి - నిజాన్ని వక్రీకరించడమే కాకుండా దానిని తప్పని చెప్పినందుకు క్షమాపణలు అడిగిన విచిత్రమైన పరిస్థితి ఏపీలో కనిపిస్తే... అడిగిన ఆ నేత ముఖ్యమంత్రి తనయుడు మన మంత్రిగారు నారా లోకేష్. పార్లమెంటులో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాన మంత్రిని కలవడాన్ని - నమస్కారం చేయడాన్ని ఈరోజు బాబు అనుకూల మీడియా పాదాభివందనం చేశారంటూ ప్రచారం చేసింది. అయితే, బయటకు వచ్చాక ఈ విషయం తెలుసుకున్న విజయసాయిరెడ్డి ఇంత దారుణమా... నేను పాదాభివందనం చేసిన వీడియో ఉంటే తెప్పించండి అంటూ సవాల్ విసిరారు. అది అపద్ధపు ప్రచారం అని కొట్టి పారేశారు. తాను అవినీతి చేసి ప్రజలు సొమ్మును తన జేబులో వేసుకుంటున్న చంద్రబాబు గజదొంగ అని - ప్రజల కోసం పదవులు పణంగా పెట్టి ప్రత్యేక హోదా పోరాటం చేస్తున్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని విజయసాయిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
అయితే, సవాల్ స్వీకరించని లోకేష్... తన తండ్రిని గజదొంగ అంటావా అని అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. వెంటనే చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని విజయసాయిరెడ్డిని డిమాండ్ చేశారు లోకేష్. మీరు కేసుల కోసం మోడీ వెంట పడుతున్నారని లోకేష్ విమర్శించారు.
కానీ ఈరోజు ఒక నెలరోజుల్లేనే లోకేష్ పై వచ్చిన ఆరోపణలు - ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం వ్యవహరించిన తీరు ఏ విధంగా ఉందో ప్రజలందరికీ తెలుసు. ఈ ఫ్రస్ట్రేషన్ తెలుగుదేశం నేతలకు నిద్రలేకుండా చేస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ అవినీతి గురించి బహిర్గతం చేయడమే కాకుండా ఏకంగా ఆధారాలు కూడా బయటపెడతాం అని చెప్పినప్పటి నుంచి తెలుగుదేశానికి ఏం పాలుపోవడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో హోదా ముసుగు వేసుకుని ప్రజల అండ సంపాదించేందుకు విఫలయత్నం చేస్తున్నట్లు తెలుగుదేశంపై విమర్శలు వస్తున్నాయి. జరగని విషయాన్ని అనుకూల మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేయడం చూస్తుంటే టీడీపీ ఆవేదన ఏ స్థాయికి వెళ్లిందో అర్థమవుతుందని సోషల్ మీడియాలో జనం వ్యంగీకరిస్తున్నారు.