ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నిన్న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఈ రోజు రాజీనామా చేయబోతున్నారు. అయితే, ఆ రాజీనామా చేస్తున్నది ఎమ్మెల్సీ పదవికో.. పార్టీ పదవికో కాదు. తమ కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ లో తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
నారా హెరిటేజ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టరుగా ఉన్నారు. ఈ రోజు ఆ పదవికి రాజీనామా చేయబోతున్నట్లుగా ఆయనే స్వయంగా ప్రకటించారు. అమరావతిలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన తన 9 ఏళ్ల హెరిటేజ్ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్నోవిజయాలు సాధించానని, హెరిటేజ్ యాజమాన్యం, సిబ్బంది సేవలు మరువలేనివని ప్రశంసించారు.
తాను ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించడం కొత్త అనుభూతినిస్తోందని, పెద్దల సభలో చిన్న వాడినని అన్నారు. 34 ఏళ్లకే మండలిలో అడుగుపెట్టానని చెప్పారు. సభలో అన్ని నేర్చుకుంటున్నానని, ప్రతిపక్షం సభలో నిన్న మంచి సలహాలు ఇచ్చిందని వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/