కాలం కాదు.. క్యాలెండ‌ర్ మ‌హిమ‌.. లోకేష్ ఏసేశాడు!!

Update: 2022-12-05 04:32 GMT
టీడ‌పీ యువ నాయ‌కుడు. పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఏమ‌న్నాడో విన్నావా సీఎం జ‌గ‌న్‌.. ఇదీ.. ఇప్పుడు నెటిజ‌న్లు అడుగుతున్న ప్ర‌శ్న‌. దీనికి కార‌ణం.. కాలం కాదు క్యాలెండ‌ర్‌! చిత్రంగా ఉన్నా ఇది నిజం. జ‌గ‌న్ అధికారంలోకి రాక‌ముందు.. వ‌చ్చిన త‌ర్వాత కూడా ఏటా జ‌న‌వ‌రిలోనే క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించి యువ‌త‌కు ఉద్యోగాలు ఇస్తాన‌న్నాడు గుర్తుందా?  ఉండే ఉంటుంది.. మ‌రిచిపోయి ఉంటారు?!

ఇదే.. ఇప్పుడు నారా గుర్తు చేస్తున్నారు. ప్రతీ ఏటా జనవరి 1నే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని హామీ ఇచ్చి నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ ఏళ్ళు గడుస్తున్నా ఒక్క జాబ్ క్యాలెండరూ ఇవ్వలేదని లోకేష్ అన్నారు.

మ‌రి ఇది సీఎం జ‌గ‌న్‌కు వినిపించిందా? అంతేకాదు, పదేళ్లలోపు సర్వీసు వున్న వారందరినీ ఇంటికి సాగనంపుతాన‌ని చెబుతున్న‌ జగన్ని జనం ఎందుకు నమ్మాలని నిలదీశారు. మ‌రి లోకేష్ అన్న‌ది ఇదైనా వినిపించిందా?  అనేది నెటిజ‌న్ల కామెంట్‌.

అంత‌టితో ఆగ‌ని లోకేష్.. వారంలో రద్దు చేస్తానన్న సీపీఎస్ 150 వారాలైనా రద్దు చేయనట్టే.. అవుట్ సోర్సింగ్ వాళ్లకి ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీ గాలికి ఎగిరిపోయిన‌ట్టేన‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మ‌రి చేయ‌రా..

అదికారంలోకి వ‌చ్చిన ఇన్నాళ్ల‌లో వాటి ఊసు కూడా ఎత్త‌లేదు క‌దా! ఇక‌, రెగ్యులర్ చేస్తారని, సమాన పనికి సమాన వేతనం ఇస్తారని ఎదురుచూస్తున్న రెండున్నర లక్షల మందికి పైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఉపాధిపైనే జగన్ వేటు వేస్తున్నారన్న లోకేష్ కామెంట్‌ను వారంతా స‌మ‌ర్థిస్తున్నారంటే.. ఇది కూడా నిజ‌మే క‌దా! అంటున్నారు.. సో.. మొత్తానికి టైం చూసి.. లోకేష్ ఏసేశాడే అనే కామెంట్లు వినిప‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News