ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఢిల్లీ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి తిరుగులేని మెజార్టీతో విజయం సాధించటం తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన కమలనాథులు మాటలు ఉత్తవేనని తేలిపోయాయి. అమిత్ షా మొదలు బీజేపీకి చెందిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొదలు కీలక నేతల వరకూ ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
ఎత్తులు వేయటంలో.. పోల్ మేనేజ్ మెంట్ లో మొనగాళ్లుగా చెప్పే మోడీషాల ప్లాన్ ఎందుకు వర్క్ వుట్ కాలేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏదైనా రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తే.. దాన్ని తమ అధీనంలోకి తెచ్చుకునే వరకూ నిద్రపోని తత్త్వం మోడీషాలది. అయితే.. వారెంత ప్రయత్నించినా కొరుకుడుపడని రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. ఆ కోవలోకే తాజాగా ఢిల్లీ చేరిందని చెప్పాలి. గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉన్న ఢిల్లీ రాష్ట్రం.. ఇప్పుడు ఆమ్ఆద్మీ పార్టీ వశమైంది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి జై కొట్టిన ఢిల్లీ ప్రజలు రాష్ట్ర ఎన్నికల వరకూ వచ్చేసరికి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయటం ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఎందుకిలా జరిగింది? కారణం ఏమిటి? అన్న విషయాల్లోకి వెళ్లినప్పుడు చాలామంది అయోధ్యలోని రామమందిర వ్యవహారం... సీఏఏ.. ఎన్నార్సీ లాంటి అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చి.. ఇవే బీజేపీ విజజయాన్ని దెబ్బేసినట్లుగా విశ్లేషిస్తున్నారు. అయితే.. అలాంటి వాదన వినిపిస్తున్న వారంతా.. ఎన్నికలయ్యాక చేసే రోటీన్ విశ్లేషణగా చెప్పక తప్పదు. మరి.. వాస్తవం ఏమిటన్నది చూస్తే.. ఢిల్లీ రాష్ట్రానికి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న దాని మీద క్లారిటీ ఇవ్వకపోవటం ఒక ఎత్తు అయితే.. ఆమ్ ఆద్మీ పార్టీ హయాంలో ఢిల్లీ లో మార్పులు చోటు చేసుకున్నాయి. అన్నింటికి మించిన ఇక్కడ ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాలకు మంచి పేరు రావటంతో పాటు.. పాలనలోనూ అవినీతి తగ్గటం లాంటి అంశాలు ప్రజల్లో కేజ్రీవాల్ మీద సానుకూలతను మరింత పెంచాయి.
గతంలో ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్నంతనే తన తర్వాత అడుగులు జాతీయ రాజకీయాల మీద అన్నట్లుగా వ్యవహరించేవారు. ఎప్పుడైతే వరుస పెట్టి దెబ్బలు తగలటం మొదలైందో.. కేజ్రీవాల్ మేల్కొన్నారు. తన బలాన్ని వదిలేసి.. బలం లేని చోట్ల అధిక్యతను నిరూపించుకోవటంలో అర్థం లేని భావించారు. వెంటనే.. జాతీయ రాజకీయాల్ని వదిలేసి.. ఢిల్లీ రాష్ట్రం.. దాని ప్రయోజనాలు అన్నట్లుగా వ్యవహరించిన వైనం ఢిల్లీ ప్రజలు ఆయనకు అధికారాన్ని కట్టబెట్టేలా చేశాయని చెప్పాలి. ఢిల్లీలో బీజేపీ పరాజయం మోడీషాల మీద కోపం కంటే కూడా కేజ్రీవాల్ మీద ఉన్న అభిమానమే కారణంగా చెప్పక తప్పదు. అంతే తప్పించి.. కొన్ని మీడియా సంస్థలు వండేస్తున్న కథనాల్లో పస లేదన్న మాట వినిపిస్తోంది.