కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేని స్థితికి పరిమితం అయ్యింది. అయితే అక్కడక్కడ కాంగ్రెస్ చేతిలో అధికారం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ పటిష్టమైన మెజారిటీతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది.
మరి కొన్ని చోట్ల మాత్రం బోటాబోటీ మెజారిటీలే కాంగ్రెస్ కు దిక్కు. ఈ నేపథ్యంలో అలాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కంకణం కట్టుకుందనే వార్తలు వస్తుండటం గమనార్హం.
అందులో భాగంగా ముందుగా మధ్య ప్రదేశ్ నే లక్ష్యంగా చేసుకుందట బీజేపీ. అక్కడ మొత్తం సీట్లకు గానూ కాంగ్రెస్ వాటా 114 కాగా - బీజేపీ చేతిలో 109 ఉన్నాయి. ఇండిపెండెంట్లు - మూడుసీట్లున్న బీఎస్పీ మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడిందక్కడ.
ఈ నేపథ్యంలో బీజేపీ అనుకుంటే కమల్ నాథ్ సర్కారును కూల్చడం పెద్ద కథ కాదు. మొన్నటి వరకూ ప్రభుత్వాలను కూల్చే ఉద్దేశం తమకు లేదని బీజేపీ చెప్పినా - ఇప్పుడు మాత్రం మళ్లీ అనుమానాలు రేగుతూ ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి మోడీ - షా ఒక లుక్ వేయనున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది.
వీలైతే రాజస్తాన్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలనేది బీజేపీ టార్గెట్ అనే ప్రచారం కూడా సాగుతూ ఉంది. అయితే.. అక్కడ మాత్రం కాంగ్రెస్ కు సొంతంగా బలం ఉంది. దీంతో అక్కడ ప్రభుత్వాన్ని కూల్చడం అంత తేలిక ఏమీ కాదు! అయినా బీజేపీ మాత్రం తన ప్రయత్నాలు తను చేయవచ్చని విశ్లేషకులు అంటున్నారు.