ట్రంప్ తోనే పాక్ కు షాకిచ్చిన మోడీ

Update: 2019-08-26 12:02 GMT
ఫ్రాన్స్ లో జరుగుతున్న ప్రపంచంలోని ఏడు అగ్రదేశాల జీ7 సదస్సులో పాకిస్తాన్ కు గట్టి షాక్ తగిలింది. ఈ సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా భారత ప్రధాని నరేంద్ర మోడీని తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆహ్వానించిన సంగతి తెలిసిందే..

ఈ సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని మోడీ ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సోమవారం సాంయత్రం భేటి అయ్యారు. ఇన్నాళ్లు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ కోరిక మేరకు తాను కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. దీనిపై భారత్ తీవ్ర నిరసన తెలిపినా ట్రంప్ మాత్రం పాత పాటే పాడారు.

తాజాగా మోడీతో ట్రంప్ భేటి అనంతరం పాకిస్తాన్ కు ట్రంప్ షాకిచ్చారు. కశ్మీర్ అంశంలో పాకిస్తాన్-ఇండియాలు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని స్పష్టం చేశారు. మూడో దేశం అవసరం లేదని ట్రంప్ మీడియాతో చెప్పడం పాకిస్తాన్ కు షాకింగ్ లా మారింది. కశ్మీర్ ద్వైపాక్షిక అంశం అని.. ఈ విషయంలో ఎవరి జోక్యం అవసరం లేదని ట్రంప్ కుండబద్దలు కొట్టడం విశేషం. దీన్ని బట్టి ట్రంప్ భారత్ కు మద్దతు పలికినట్టు అయ్యింది.

అంతేకాదు.. ఉగ్రవాద నిర్మూలన విషయంలో భారత్ కు సహకరిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. ఇది పాకిస్తాన్ కు మింగుడుపడని విషయంగా మారింది. ఇన్నాళ్లు ట్రంప్ ను నెత్తిన పెట్టుకొని కశ్మీర్ విషయంలో భారత్ ను ఇబ్బంది పెట్టాలని చూసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ కు ఇప్పుడు ట్రంప్ భారత్ కు మద్దతుగా చేసిన ప్రకటన షాకింగ్ లా మారింది.
    

Tags:    

Similar News