కొత్త నోట్ల కష్టం మోడీ అమ్మకు తప్పలేదు

Update: 2016-11-15 08:03 GMT
దేశం కోసం తన వాళ్లను.. తన కుటుంబాన్ని వదులుకున్నట్లుగా రెండు రోజుల క్రితం ప్రధాని మోడీ చేసిన భావోద్వేగ ప్రసంగం స్మృతి పథం నుంచి పోక ముందే ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. నోట్ల రద్దుపై ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంతో దేశ వ్యాప్తంగా చిల్లర నోట్ల కష్టాలతో దేశ ప్రజలంతా పడుతున్న వేళ.. ప్రధాని తల్లి హీరాబెన్ బ్యాంకుకు రావటం అందరి దృష్టిని ఆకర్షించింది.

బ్యాంకు లోపలకు నడుచుకుంటూ వచ్చినా.. ఆమె తెచ్చిన పెద్దనోట్లకు చిల్లరనోట్లను మార్చి ఇచ్చేందుకు సమయం పట్టే నేపథ్యంలోఆమెకు చక్రాల కుర్చీలో కూర్చోబెట్టారు బ్యాంకు అధికారులు. గుజరాత్ లోని గాంధీ నగర్ లోని బ్యాంకుకు కుటుంబ సభ్యులతో మోడీ తల్లి వచ్చారు.

తన కొడుకే దేశ ప్రధాని అయినప్పటికీ ఒక సామాన్యురాలి మాదిరి తన పరివారంతో బ్యాంకు వచ్చినఆమె.. తన దగ్గర ఉన్న పాత నోట్లను బ్యాంకు అధికారులకు అప్పగించి.. కొత్త నోట్లను తీసుకున్నారు. అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారి కుటుంబాలు చిల్లర నోట్ల కోసం బయటకు రాకున్నా.. దేశ ప్రధాని తల్లే స్వయంగా బ్యాంకుకు రావటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News