పెద్ద నోట్ల రద్దు - జీఎస్టీ బిల్లు - పెట్రోల్ - డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశంలో ప్రధాని నరేంద్ర మోదీపై వ్యతిరేకత పెరిగిందని అనుకున్నారంతా. అదే సమయంలో ప్రతిపక్షాలన్నీ ఏకం కావడంతో ఈ సారి భారతీయ జనతా పార్టీకి భారీ ఓటమి తప్పదని చాలా మంది భావించారు. కానీ - ఇటీవల వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్వతంత్రంగా మేజిక్ ఫిగర్ ను చేరుకుని ఔరా అనిపించింది. మోదీ హవా వరుసగా రెండో పర్యాయం కూడా బాగా కనిపించింది. దీంతో మిత్రపక్షాల సాయంతో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. కేంద్ర కేబినెట్ ఏర్పాటు కూడా నాలుగు రోజుల క్రితం పూర్తవడంతో బీజేపీ నేతలు కాంగ్రెస్ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ - రాజస్తాన్ - కర్నాటక రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చేయడానికి పావుల కదుపుతున్నారని ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి ఎన్నికలకు ముందే ప్రధాని మోదీతో పాటు అమిత్ షా ఆ రాష్ట్రాలపై ఫోకస్ చేశారు. ఎలాగైనా అక్కడ ప్రభుత్వాలను కూల్చేయాలని పట్టుదలతో పావులు కదిపారు. మూడు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు చెందిన చాలా మంది ఎమ్మెల్యేలకు గాలం వేశారు. ఇక, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మూడు ప్రభుత్వాలు కూలిపోతాయని అంతా అనుకున్నారు. అయితే, ఎన్నికల తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారట. దేశమంతటా ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పట్టిన వేళ మధ్యప్రదేశ్ - రాజస్తాన్ - కర్నాటక రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చారనే చెడ్డపేరు తమకు వస్తుందనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ నేతలకు ఇప్పటికే సంకేతాలు కూడా వెళ్లిపోయాయట.
మధ్యప్రదేశ్ లో మొత్తం అసెంబ్లీ సీట్లు 230. ఇందులో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకోగా - బీజేపీ 109 చోట్ల విజయం సాధించింది. బీఎస్పీ 2 - ఎస్పీ ఒక సీటు - నలుగురు స్వతంత్రులు గెలిచారు. దీంతో బీఎస్పీ - ఎస్పీ - నలుగురు ఇండిపెండెంట్ల మద్దతుతో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ సీట్లుండగా కాంగ్రెస్ 112 సీట్లు గెలువగా - బీఎస్పీ 6 స్థానాలు - ఆర్ ఎల్ డీ ఒక స్థానం - స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటు చేశారు. 224 మంది ఎమ్మెల్యేలు ఉన్న కర్నాటక శాసనసభలో కేవలం 37 స్థానాలు కల్గిన జేడీఎస్ - 80 స్థానాలున్న కాంగ్రెస్ తో పాటు ఇరువురు స్వతంత్రులను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీకి 104 స్థానాలు ఉండగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో ఆ సంఖ్య 105కు చేరింది.