ఇలాంటి ‘మహా’ సేల్ మోడీ సార్ కే సాధ్యం.. ప్రభుత్వ భూముల అమ్మకానికి కార్పొరేషన్
తాతల కాలం నాటి ఆస్తుల్ని అమ్మే విషయంలో ఏ కుటుంబమైనా కిందా మీదా పడుతుంది. ఎంతో అవసరం లేకుంటే అమ్మేందుకు ఇష్టపడరు. అందుకు భిన్నంగా కమర్షియల్ గా ఉండటం.. ప్రాక్టికల్ గా ఉంటామన్న పేరుతో.. భావోద్వేగాలను పట్టించుకోకుండా ఆస్తులు ఉన్నవి అమ్ముకోవటానికే అన్నట్లుగా వ్యవహరించేటోళ్లు కొందరు కనిపిస్తుంటారు. అయితే.. ఇలాంటి మైండ్ సెట్ వ్యక్తులకు కాకుండా ప్రభుత్వాలకు రావటం మాత్రం కొందరి నాయకత్వంలోని ప్రభుత్వాలకే సాధ్యమని చెప్పాలి.
ఆస్తుల్నికూడబెట్టటం ఎందుకు? అంటే.. భవిష్యత్ తరాల అవసరాలకు ఉపయోగపడటానికి. ఇవాల్టి రోజున పలు ప్రభుత్వాలు ఆస్తుల అమ్మకాల పేరుతో భారీ ఎత్తున భూముల్ని అమ్మేసి.. వేలాది కోట్లను ఖజానాకు చేరుస్తున్నాయి ఇదంతా ఎలా సాధ్యమైందంటే.. గత పాలకులు ముందుచూపుతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆస్తుల్ని సమకూర్చటంతోనే ఇప్పుడు వాటిని అమ్మే అవకాశం కలుగుతుంది. ఆస్తుల్ని జాగ్రత్తగా కాపాడుతూ భవిష్యత్ తరాలకు ఆస్తులుగా ఇవ్వాల్సిన ప్రభుత్వాలు.. నిరర్ధక ఆస్తుల పేరుతో అమ్మకాలకు పాల్పడటంలో కొన్ని ప్రభుత్వాలు మహా దూకుడుగా వ్యవహరిస్తుంటాయి.
దానికి చక్కటి ఉదాహరణగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని చెప్పక తప్పదు. ఇంతకాలం లాభాలు రాని.. నష్టాల్ని మూటకట్టే సంస్థల్ని అమ్మేసే తీరుకు భిన్నంగా.. లాభాల పంట పండించే సంస్థల్ని సైతం అమ్మేసుకుంటున్న ఘనత మోడీ సర్కారుకే చెల్లు. తాజాగా ఆయన ప్రభుత్వం మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థల వద్ద నిరుపయోగంగా పడి ఉన్న మిగులు భూములు.. భవనాలు.. తదితర ఆస్తులను ఆదాయంగా మార్చుకోవటానికి వీలుగా.. మహా సేల్ ను నిర్వహించాలన్న ఆలోచనలోమోడీ సర్కారు ఉంది.
తాజాగాముగిసిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందులో భాగంగా నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు. ఇంతకీ ఈ సంస్థ చేసేదేమంటే.. ప్రభుత్వం వినియోగించని భూముల్ని అమ్మకానికి పెట్టేందుకు వీలుగా ఒక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయటం ద్వారా.. రానున్న రోజుల్లో తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున భూముల అమ్మకాలకు తెర తీస్తుందన్న సంకేతాల్ని స్పష్టంగా చూపించేవారు.
ఈ కార్పొరేషన్ ను రూ.5వేల కోట్ల మూలధనంతో ప్రారంభించనున్నారు. తక్షణమే కేంద్రంరూ.150 కోట్లను పెయిడప్ షేర్ క్యాపిటల్ ను సమకూర్చనున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల వద్ద భారీ మొత్తంలో మిగులు భూమి.. పెద్దగా వినియోగించని భూములు.. అస్సలు వాడని భూములు.. భవనాలు ఉన్నాయి. ఇలాంటి వాటిని అమ్మేయటం ద్వారా.. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదాయాన్ని సొంతం చేసుకోవటానికి వీలుగా మోడీ మాష్టారి ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుందని చెబుతున్నారు.
ఇలా ఉన్న ఆస్తుల్ని అమ్ముకుంటూ పోతే.. రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగ సంస్థల పేరుతో ఉండాల్సిన ఆస్తులు కరిగిపోతాయి. రేపొద్దున ఏదైనా అవసరం వస్తే.. అమ్మటానికి భూములు.. భవనాలు.. సంస్థలు లేని వేళ.. మోడీ వారసులకు అమ్మటానికి ఇంకేం మిగలవు. ఇది సరైన పద్దతేనా? అన్నది అసలు ప్రశ్న. దీనికి సమాధానం చెప్పే దమ్ము ఎవరికి ఉంది దేశంలో?