త‌మ్ముళ్ల‌కు వ‌ణుకు పుట్టిస్తున్న దాడుల హెచ్చ‌రిక‌లు

Update: 2018-10-04 06:05 GMT
రాజ‌కీయం అంత‌కంత‌కూ వేడెక్కుతోంది. హ‌ద్దులు దాటిన ఏపీ స‌ర్కారు అవినీతిపై మోడీ స‌ర్కారు న‌జ‌ర్ వేసిన‌ట్లుగా చెబుతున్నారు. బాబు మిత్ర‌ప‌క్షంగా ఉన్న నాటి నుంచి టీడీపీ స‌ర్కారులో చోటు చేసుకున్న అవినీతిపై మోడీ ప‌లుమార్లు ఫీడ్ బ్యాక్ ఇచ్చిన‌ట్లుగా చెబుతారు. బాబు స‌ర్కారు ఇమేజ్ డ్యామేజ్ మాత్ర‌మే కాదు.. అధికార‌ప‌క్షానికి మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించిన పాపానికి త‌మ పైనా మ‌ర‌క‌లు ప‌డ‌తాయ‌న్న మాట‌ను బాబుకు మోడీ చెప్పిన‌ట్లుగా చెబుతారు. కానీ.. త‌న తీరును మార్చుకోవ‌టంలో చంద్ర‌బాబు ఏ మాత్రం బాధ్య‌త తీసుకోలేద‌న్న అసంతృప్తి మోడీకి ఉన్న‌ట్లుగా ప‌లువురి నోట వినిపిస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఏపీ మంత్రుల మీద ఐటీ దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న వార్నింగ్ ను క్యాబినెట్ లోని మంత్రుల‌కు బాబు ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. తెలంగాణ‌లో టీఆర్ఎస్ - బీజేపీల మ‌ధ్య‌నున్న అనుబంధం నేప‌థ్యంలో ఏపీలోని త‌మ స‌ర్కారుపై న‌జ‌ర్ వేస్తార‌ని.. టీడీపీ ప్ర‌తిష్ట‌ల‌ను భంగం వాటిల్లేలా చేసి.. రాజ‌కీయ ల‌బ్థి కోసం ప్లాన్ చేస్తార‌న్న మాట బాబు స్వ‌యంగా చెప్ప‌టంతో ఏపీ మంత్రుల్లో ఇప్పుడు వ‌ణుకు పుడుతోంది.

అవ‌స‌రం లేకున్నా ఓటుకు నోటు కేసును తెర‌పైకి తీసుకొస్తున్నార‌ని.. రానున్న రోజుల్లో ప‌లువురు ఏపీ మంత్రులపై ఐటీ దాడులు జ‌రిగే వీలుంద‌ని చెబుతున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్న ఆదేశాల్ని జారీ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఏపీ మంత్రుల దిన‌మొక గండం మాదిరిగా మారింది. మ‌రి.. బాబు చెప్పిన‌ట్లే ఏపీ మంత్రుల‌పై మోడీ ఐటీ అస్త్రాన్ని ప్ర‌యోగిస్తారా? అన్న‌ది చూడాలి.


Tags:    

Similar News