తమిళనాడు ముఖ్యమంత్రి - అన్నాడీఎంకే పార్టీ నేతలు - కార్యకర్తలు - అభిమానుల అమ్మ మొత్తంగా పురుచ్చితలైవి జయలలిత స్పృహలోనే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ రాష్ట్రం సహా దేశ వ్యాప్తంగా జయ ఆరోగ్యంపై నెలకొన్న ఉత్కంఠకు ఒకింత తెరపడినట్టే కనిపిస్తోంది. సెప్టెంబరు 20న జ్వరంతో ఆస్పత్రిలో చేరిన జయ ఇప్పటికీ అపోలోలోనే చికిత్స పొందుతున్నారు. విదేశీ వైద్యుల పర్యవేక్షణలోనే వైద్యం అందుతున్నా.. దాదాపు 20 రోజులు దాటిపోవడంతో ఆమె ఆరోగ్య స్థితిపై వదంతులు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆమె అభిమానులు పెద్ద ఎత్తున రాష్ట్రంలో పూజలు - అభిషేకాలు కూడా చేయించారు.
ఇక, జయ ఇప్పట్లో డిశ్చార్జ్ అయ్యే పరిస్థితి లేదని, మరో నెల రోజులు ఆమె ఆస్పత్రికే పరిమితం అవుతారని వైద్యులు చెప్పడంతో రాష్ట్రంలో పాలనపై చర్చ వచ్చింది. గతంలో జయ ఓ కేసులో ఇరుక్కున్న సందర్భంలో అప్పటి ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వంను తాత్కాలిక సీఎంగా నియమించారు. ఇప్పుడు కూడా నిన్నంతా ఆయన పేరే రాష్ట్రంలో మార్మోగిపోయింది. జయ మరో నెల రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని తెలియడంతో తాత్కాలిక సీఎంగా పన్నీరు సెల్వంను నియమించే ఛాన్స్ ఉందని మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.
నిన్న రాత్రి వరకు పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో పన్నీరు సెల్వం తాత్కాలిక సీఎం కావడం ఖాయంగా కనిపించింది. అయితే, శనివారం ఉదయం మీడియాతో మాట్లాడిన అన్నాడీఎంకే అధికార ప్రతినిధి అవధి కుమార్ తమిళనాడుకు తాత్కాలిక ముఖ్యమంత్రిని నియమించాల్సిన అవసరం లేదన్నారు. గతంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తినప్పుడు మాత్రమే ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం సీఎంగా బాధ్యతలు చేపట్టారని, ప్రస్తుతం అటువంటి పరిస్థితి ఏమీ లేదని అన్నారు. దీంతో తమిళనాట ఆనందం వెల్లివిరిసింది.
చెన్నైకి ప్రధాని మోడీ
తీవ్ర అనారోగ్యంతో గడిచిన 20 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఎం జయ లలితను పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చెన్నైకి వస్తున్నారు. ప్రధాని మోడీ ఒకటి రెండు రోజుల్లో జయలలితను పరామర్శించే అవకాశం ఉంది. ప్రధాని పర్యటనకు భద్రత కల్పించాలంటూ తమిళనాడు సర్కార్ ను పీఎంవో ఆదేశించినట్లు తెలిసింది. కాగా, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు - ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం చెన్నై వచ్చి జయ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కొన్ని కారణాల రీత్యా ఆయన కేవలం అద్దాల గది నుంచి మాత్రమే ఆమెను చూసి బయటకు వచ్చేశారు.