కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా విధించిన తొలివిడత లాక్ డౌన్ వల్ల సత్ఫలితాలు వచ్చిన నేపథ్యంలో మే 3వరకు లాక్ డౌన్ 2.0ను దేశ ప్రధాని మోడీ విధించారు. కఠినంగా ఉన్నప్పటికీ...కరోనాను తరిమికొట్టాలంటే లాక్ డౌన్ కు మించిన మార్గం లేదని భారత్ తో పాటు పలు దేశాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, మరోవైపు లాక్ డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతోపాటు చిల్లర వర్తకులు - చిన్న వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఏప్రిల్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇక, మే 3 సమీపిస్తున్న తరుణంలో లాక్ డౌన్ 2.0 ఎత్తివేస్తారా...లేదంటే కొనసాగిస్తారా అన్న చర్చ మరోసారి జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భారత ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. లాక్ డౌన్ విధించిన తర్వాత రెండు సార్లు సీఎంలందరితో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రేపు జరగబోయే వీడియో కాన్ఫరెన్స్ లో మోడీ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అన్ని రాష్ట్రాల - కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సీఎంలతో మోడీ మూడోసారి భేటీ కాబోతున్నారు. కరోనా వ్యాప్తి కట్టడి - లాక్ డౌన్ అమలు జరుగుతున్న తీరు - ఆంక్షల కొనసాగింపు - సడలింపు తదితర అంశాలపై అన్ని రాష్ట్రాలు - కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో ప్రధాని చర్చించనున్నారు. దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేసే విషయంపై సీఎంలతో ప్రధాని మాట్లాడే అవకాశం ఉందని పీఎంవో వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 20నుంచి ఇచ్చిన సడలింపుల మాదిరిగానే మరికొన్ని సడలింపులు, దశలవారీగా గ్రీన్ జోన్లలో లాక్ డౌన్ ఎత్తివేత వంటి అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాలని మహారాష్ట్ర - ఢిల్లీ - యూపీ - రాజస్థాన్ తదితర రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి. కేంద్రం నిర్ణయం తర్వాత తమ స్టాండ్ ఏమిటో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాలు వేచి చూస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్ డౌన్ కొనసాగింపునకు సుముఖంగా ఉండగా....ఏపీ సీఎం జగన్ మాత్రం గ్రీన్ జోన్లలో లాక్ డౌన్ ఎత్తివేయాలని మోడీకి సూచించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎంలతో ప్రధాని మోడీ వీడియో భేటీపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.