టీడీపీ అధినేత చంద్రబాబుపైనా.. మాజీ మంత్రి నారాయణపైన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి సీఐడీకి కంప్లైంట్ చేయటం తెలిసిందే. ఈ ఉదంతంపై ఈ ఇద్దరు ప్రముఖులకు సీఐడీ నోటీసులు ఇవ్వటం.. దానిపై హైకోర్టుకు ఆశ్రయించిన బాబు.. నారాయణ.. స్టే తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా.. తమ భూముల్ని అక్రమంగా లాగేసుకున్నారన్న కంప్లైంట్ ఇచ్చినట్లుగా పేర్కొన్న మహిళలు తెర మీదకు వచ్చి తాము ఫిర్యాదు చేయలేదన్న కొత్త విషయం బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోల్ని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర తాజాగా బయటపెట్టిన వైనం సంచలనంగా మారింది.
ఆళ్ల పేర్కొన్న కందా పావని.. ఈపూరి సుబ్బమ్మ.. అద్దేపల్లి సాంబశివరావు తదితరులు సంచలన అంశాల్ని వెల్లడించారు. విచారణ పేరుతో కొందరు తమ వద్దకు వచ్చారని.. భూమి అమ్మారా? లేదా? అని నిర్దారించుకుంటున్నట్లుగా సంతకాలు పెట్టించుకున్నారన్నారు. భూమి అమ్మినట్లుగా నిర్దారణ కోసమంటేనే సంతకం పెట్టామని.. దాన్ని కేసుగా నమోదు చేసినట్లు చెప్పారు. తాను ఓసీనని వెల్లడించారు. తమ ఉదంతం మీడియాలో వచ్చే వరకు కేసు అన్న విషయం తమకు తెలియదన్నారు.
కేసు కోసమే అయితే సంతకాలే పెట్టేవాళ్లం కాదని వారు పేర్కొనటం గమనార్హం. బలవంతంగా భూములు లాక్కున్నారా? అంటే కాదని తాము చెప్పామని.. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. దీంతో.. సీఐడీ కేసుల విషయం కొత్త కోణం బయటకు వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమైంది.