దేశంలో నమోదు అవుతున్న హత్య కేసుల్లో మెజారిటీ వాటికి కారణం 'ప్రేమే' అని అంటున్నాయి పోలీసుల నివేదికలు. జాతీయ స్థాయిలో శాంతిభద్రతల పరిస్థితి గురించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చేసిన ఒక ప్రకటన సారాంశం ఇదే.
గత పదిహేనేళ్లుగా దేశంలో క్రైమ్ చోటు చేసుకుంటున్న అంశాల గురించి ఈ రిపోర్టులో విశ్లేషించారు. దాని సారాంశం ఏమిటంటే.. అత్యధికంగా హత్యలు జరుగుతున్నది ప్రేమ వ్యవహారాల వల్లనే! గతంతో పోలిస్తే దేశంలో హత్యలు బాగా తగ్గాయని ఈ రిపోర్టు పేర్కొంది. రెండు వేల పదిహేడులో దాదాపు ఇరవై ఎనిమిది వేల హత్యలు చోటు చేసుకున్నాయని ఈ రిపోర్టులో పేర్కొన్నారు.
అందులో మెజారిటీ హత్యలు ప్రేమ వ్యవహారాల వల్లనే అని తేల్చింది ఈ నివేదిక. ప్రేమ వల్ల హత్యలు ఏమిటి అంటే.. ప్రేమించుకున్నారని హత్య చేయడం - ప్రేమించలేదని హత్య చేయడం - భార్యలపై అనుమానంతో భర్తలు చేసిన హత్యలు.. పరువు హత్యలూ.. గట్రా.
ఇలా దేశంలో హత్యలకు కారణాల్లో ప్రేమ ప్రముఖంగా ఉంటోందని ఈ నివేదికలో వివరించారు. ఇక వ్యక్తిగత కక్షలతో జరిగే హత్యలు - ఆస్తుల కోసం జరిగే హత్యలు చాలా వరకూ తగ్గాయని ఈ రిపోర్టు విశ్లేషించింది. పరువు హత్యలు మాత్రం పెరుగుతున్నాయని పేర్కొంది. మొత్తంగా ఇండియాలో హత్యలకు మూలం ప్రేమే అని పోలీసుల నివేదిక పేర్కొండటం గమనార్హం!