డీజిల్ కారుకు పదేళ్లా? ఇక కష్టమే

Update: 2016-07-18 10:38 GMT
ఎప్పటి నుంచో వినిపిస్తున్న ఒక మాట ఇప్పుడు అమలుకు దగ్గరగా వచ్చినట్లు చెప్పొచ్చు. కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు వీలుగా పదేళ్లు దాటిన డీజిల్ వాహనాల్ని వెంటనే బ్యాన్ చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నదే. అయితే.. ఇది ఆచరణకు నోచుకోలేదు. తాజాగా ఈ అంశంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దీని ప్రకారం.. పదేళ్లు దాటిన డీజిల్ కార్లను రోడ్ల మీదకు రాకుండా చూడాలని.. ఈ తీర్పును తక్షణమే అమలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

తాజా తీర్పుతో పదేళ్లు దాటిన డీజిల్ వాహనదారులకు కొత్త కష్టం ఎదురైనట్లే. దేశంలోనే అత్యధిక వాయు కాలుష్య నగరంగా నిలిచిన దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో ఈ తీర్పులు అమలు చేస్తే పెద్ద ఎత్తున డీజిల్ కార్ల యజమానులకు దెబ్బ పడే అవకాశం ఉంది. మరి.. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును వెనువెంటనే అమలు చేస్తారా? మరికాస్త గడువు ఇస్తారా? అన్నది చూడాలి. వెంటనే అమలు చేయాలన్న నిర్ణయం తీసుకుంటే మాత్రం ఢిల్లీ నగరంలోని డీజిల్ వాహన యజమానులకు తాజా తీర్పు శరాఘాతంగా మారినట్లే.
Tags:    

Similar News