మొన్నటి వరకూ కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారం చేపట్టే అవకాశాలే లేవని చెప్పిన ఇండియాటుడే కూడా ఇప్పుడు.. మళ్లీ బీజేపీకే పట్టం కడుతోంది. మూడ్ ఆఫ్ ద నేషన్ అంటూ.. బీజేపీ గ్రాఫ్ పడిపోతోందని చెబుతూ వచ్చిన ఇండియాటుడే ఇప్పుడు మూడ్ అలా లేదని అంటోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కమలం పార్టీ గ్రాఫ్ సర్రున పైకి లేస్తోందని ఇండియాటుడే చెబుతుండటం విశేషం.
బీజేపీ సోలోగా అధికారంలోకి రాలేకపోయినా.. ఎన్డీయే రూపంలో మాత్రం అధికారానికి దగ్గర దగ్గరగా ఉంటుందని ఇండియాటుడే తేల్చింది.
కేవలం ఆ మీడియా సంస్థ మాత్రమే కాదు..తాజాగా జీ నెట్ వర్క్ సర్వే కూడా అదే మాటే చెబుతోంది. మోడీకి మరో ఛాన్స్ ఖాయమని ఈ మీడియా సంస్థ కూడా తన తాజా సర్వేను వెల్లడించింది. ఈ రెండు మీడియా సంస్థలూ మోడీకి మరీ అంత అనుకూలమైనవి ఏమీ కావు. ఇవే ఇలా చెబుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు.
గత కొన్ని రోజుల్లో ఉత్తరాదిన రాజకీయ పరిస్థితులు బాగా మారిపోయాయని ఈ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రత్యేకించి ఇటీవల మధ్యంతర బడ్జెట్ లో మోడీ ఇచ్చిన వరాలు - ఆ తర్వాత కశ్మీర్లో పరిస్థితులు బీజేపీ గ్రాఫ్ ను అమాంతం పెంచేశాయని విశ్లేషించవచ్చు.
మధ్యంతర బడ్జెట్ లో మోడీ రైతులకు పెట్టుబడి నిధి విషయంలో హామీ ఇచ్చారు. ప్రతి నాలుగు నాలుగు నెలలకూ రెండు వేల రూపాయల పెట్టుబడి మొత్తాన్ని సమకూర్చుతున్నట్టుగా ప్రకటించారు. కేవలం ప్రకటించడమే కాదు.. తక్షణమే దాన్ని అమలు చేశారు కూడా. ఇప్పటికే ‘మోడీ డబ్బులు పడ్డాయి..’ అని రైతులు చర్చించుకోవడం కనిపిస్తూ ఉంది.
ఇక పుల్వామా టెర్రర్ అటాక్ అనంతరం మోడీ ప్రభుత్వం స్పందించిన తీరు మధ్యతరగతికి బాగా నచ్చేసింది. టెర్రర్ క్యాంపులపై ప్రతీకారదాడులు, భారత ఎయిర్ ఫోర్స్ వీరోచిత విన్యాసాలు - అభినందన్ ను సురక్షితంగా రప్పించడం.. ఇవన్నీ మోడీ ప్రభుత్వ ఘనతలుగా.. మోడీకే సాధ్యం అయినవి సామాన్యులు అనుకుంటున్నారు. ఈ పరిణామాలు మోడీ గ్రాఫ్ ను ఖాయంగా పెంచి ఉండవచ్చు.
ప్రత్యేకించి యూపీలో నెల కిందటకూ - ఇప్పటికీ పరిస్థితులు మారిపోయాయని.. ఎస్పీ - బీఎస్పీలు కలిసినా.. బీజేపీని మరీ చిత్తుగా ఓడించే పరిస్థితి లేదని సర్వేలు చెబుతున్నాయి. తన చర్యలతో అటు రైతులను - ఇటు మిడిల్ క్లాస్ ను మోడీ ఆకట్టుకొంటూ ఉన్నారని.. పాక్ కు బుద్ధి చెప్పాలన్నా.. అది మోడీకే సాధ్యం అవుతుందనే నమ్మకం ప్రజల్లో కలుగుతూ ఉండటం - రాహుల్ వారికి ఆ భరోసాను ఇవ్వలేకపోవడం.. ప్రియాంక కొత్తగా ఊపు ఏమీ తీసుకురాలేకపోవడం వంటివి.. బీజేపీ ని నిలబెడుతున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.