ట్రంప్‌ పై 200 మంది ప్ర‌జాప్ర‌తినిధుల దావా

Update: 2017-06-16 09:48 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ దేశంలోని ప్ర‌జా ప్ర‌తినిధుల నుంచి ఊహించ‌ని షాక్ త‌గిలింది. విదేశాల నుండి చెల్లింపులను స్వీకరించడం ద్వారా అధ్యక్షుడు  ట్రంప్‌ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారంటూ 200మందికి పైగా డెమోక్రటిక్‌ సెనెటర్లు - ప్రతినిధుల సభ సభ్యులు ట్రంప్‌ పై దావా వేశారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు విదేశాల నుండి చెల్లింపులు - బహుమతులు అందుకోవడం నిషిద్ధం. ఒకవేళ అలా స్వీకరించాలంటే అందుకు అమెరికన్‌ కాంగ్రెస్‌ అనుమతి తప్పనిసరి. ట్రంప్‌ అధ్యక్షుడైన వెంటనే తన వ్యాపారాన్ని కుమారులకు అప్పగించినప్పటికీ విదేశీ ప్రభుత్వాల నుండి, ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ లాభాల నుండి ఆయన ఇంకా వాటా పొందుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజా దావా న‌మోదైంది.

ట్రంప్‌ అధ్యక్షుడైనప్పటి నుండి ట్రంప్ సంస్థ‌లు అనేక ఆకర్షణీయమైన పేటెంట్లను సాధించింది. ఆయన ఆస్తులను ఉపయోగించుకుంటున్న సౌదీ అరేబియా - ఇతర దేశాల లాబీయిస్ట్‌ ల నుండి ఫీజు వసూలు చేస్తోంది. ట్రంప్‌ తన పన్ను రిటర్న్స్‌ విడుదల చేయడానికి తిరస్కరిస్తున్నందున విదేశాల నుండి ఆయనకు వచ్చే చెల్లింపులు ఎంతో తెలిసే అవకాశం లేదని తాజాగా దాఖలైన దావా పేర్కొంటోంది. ఇదే కారణాలపై మరో రెండు దావాలు దాఖలయ్యాయి. ఒకటి ప్రైవేట్‌ వాచ్‌ డాగ్‌ గ్రూపు - రెండోది మేరీలాండ్‌ రాష్ట్రం - కొలంబియా జిల్లా దాఖలు చేశాయి. అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వం - రాష్ట్ర ప్రభుత్వాల నుండి లాభాలు పొందకుండా ఇతర రాజ్యాంగ పరిమితులు అధ్యక్షుడిని నిలువరిస్తున్నాయి. న్యూయార్క్‌ లో ట్రంప్‌ కి చెందిన ట్రంప్‌ టవర్‌ లో పెద్ద మొత్తంలో స్థలాన్ని ట్రంప్‌ సీక్రెట్‌ సర్వీస్‌ అంగరక్షకులకు, రక్షణ శాఖకు అద్దెకివ్వడం ద్వారా ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ లబ్ది పొందుతోంది. అయితే రాజ్యాంగంలో పేర్కొంటున్న ''ఎమాల్యుమెంట్స్‌ (వేతనాలు - అలవెన్సులు)'' అనే నిర్దిష్ట పదం భావనను ఇంతవరకు కోర్టులో పరీక్షించనందున చట్టపరంగా ఎలా వ్యవహరిస్తారనేది స్పష్టం కాలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News