ప్రస్తుతం లాక్‌డౌన్ పొడగింపుతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా పరుషులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇన్నాళ్లు కొన్ని రోజులే కదా అని సర్దుకున్న పురుషులు ఇప్పుడు లాక్‌డౌన్ మే 3వ తేదీ వరకు పొడిగించడంతో వారికి కొత్త సమస్య వచ్చిపడింది. అదే తల వెంట్రుకలు, గడ్డాలు. లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి హెయిర్ సెలూన్లు, బ్యూటీ పార్లర్లు మూసివేశారు. చిన్నచిన్న కటింగ్ దుకాణాలు కూడా మూతపడ్డాయి. దీంతో పురుషులు తల వెంట్రుకలు సత్యసాయి బాబాను, గడ్డాలు స్వామిజీలను తలపిస్తున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో దుకాణాలు మూతపడడంతో నాయీ బ్రాహ్మణులు ఉపాధి కోల్పోగా.. ప్రజలు గడ్డాలు, మీసాలు పెంచుకుని ఇళ్లకే పరిమితమయ్యారు.
గడ్డాలు, మీసాలు అంటే కత్తెరతో చేసుకోవచ్చు. ఇంట్లో ట్రిమ్మర్, కత్తెరతో కొంత తగ్గించుకునే అవకాశం ఉంది. కానీ తల వెంట్రుకల విషయంలోనే ఇబ్బంది ఏర్పడుతోంది. ఎంత చేసుకోవాలనుకున్న మన కటింగ్ మనం చేసుకోలేం. గడ్డమే సక్రమంగా చేసుకోలేం. అలాంటి తల వెంట్రుకల విషయంలో మరీ కష్టం. దీంతో పురుషుల తలలు పెద్దగా మారిపోయాయి. తల వెంట్రుకలు, గడ్డాలు పెరుగుతుండడంతో వారికే చిరాకేస్తోంది. ఎప్పటికప్పుడు తీయించుకోకపోతే అసహనానికి దారి తీస్తుంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితే ప్రతి ఇంట్లోనూ ఉంది.
ఇన్నాళ్లు కటింగ్ షాపుల్లో వివిధ రకాల స్టైల్స్‌లో కటింగ్ చేసుకునే యువత ఇప్పుడు చింపిరి జుట్టుతో కళావిహీనంగా కనిపిస్తున్నారు. ఇక పెద్దవారు చాదస్తానికి పోయి తమ కుటుంబసభ్యుల సహాయంతో తల వెంట్రుకలు కట్ చేయించుకుంటున్నారు. తలకు రంగులు కూడా వేసుకుంటున్నారు. ఇక పిల్లల జుట్లు కూడా బాగా పెరిగిపోవడంతో ఆ ఇంటి పెద్దలు కటింగ్ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా రెండు వారాల పాటు ఉంటే వారిని చూడలేమని భావించి సొంతంగా నాయీ బ్రాహ్మణుల అవతారం ఎత్తుతున్నారు. తమకు ఇష్టమొచ్చిన రీతిలో కటింగ్ చేస్తూ కష్టాలు పడుతున్నారు.