ఏపీ ఫలితాలు.. 23కు ముందే..

Update: 2019-04-26 08:25 GMT
నరాలు తెగుతున్నాయి.. బీపీ పెరిగిపోతోంది. ఏపీలో ఎవరిది గెలుపు అని అడిగితే చాలు రకరకాల సమీకరణాలు లెక్కలు.. సాధారణ జనానికే ఇలా ఉంటే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీచేసిన ప్రజాప్రతినిధుల పరిస్థితులు ఎలా ఉంటాయి.. వారి ఫ్యూజ్యూలు ఎగిరిపోవు.. ఇప్పుడు అలాంటి విపత్కర ఉత్పాతాన్నే ఎదుర్కొంటున్నారు ఏపీలోని రాజకీయ ప్రజాప్రతినిధులు.

తెలుగు రాష్ట్రాల్లో తొలి విడతలోనే ఎన్నికలు పెట్టి మోడీ ఏం ప్లాన్ గీశారో కానీ.. మన రాజకీయ నేతలకు మాత్రం బీపీ, షుగర్, ఒత్తిడి పెరిగి పోయి ఆస్పత్రుల పాలవుతున్నారు. ఏప్రిల్ 11న ఎన్నికలు ముగిస్తే మే 23వరకు ఆగాల్సిందే.. ఇంకా 28 రోజుల టైం ఎలా గడుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.  అప్పటిదాకా లెక్కలేసుకోవడం.. పరిశీలించడం..వివిధ సర్వేలు, విశ్లేషణలతో కడుపు నింపుకోవడమే పని..

ఓట్ల పండుగ పూర్తయిన నాటి నుంచి ఏపీలోని టీడీపీ, వైసీపీ నేతలు తమ అనుచరులు, నాయకులతో వివిధ సర్వే ఏజెన్సీలతో తమ గెలుపుపై ఆరాలు తీస్తూ సమీక్షిస్తూ గెలుస్తామా లేదా అనే టెన్షన్ పడుతున్నారు.

నిజానికి మే 23వరకూ ఫలితాల కోసం ఊపిరి బిగబట్టి నేతలు ఆగాల్సిన పనే లేదు. ఎందుకంటే చివరి విడత పోలింగ్ దేశంలో మే 19వ తేదీన సాయంత్రం 5 గంటలకు ముగిసిపోతుంది. 5 గంటలు దాటగానే ఇక దేశంలోని ప్రఖ్యాత మీడియా సంస్థలు, సర్వే ఏజెన్సీలు, ప్రాంతీయ చానెళ్లన్నీ ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి. ఎంత లేదన్నా 20 నుంచి 30 సర్వేలు దేశంలో ఎవరూ అధికారంలోకి వస్తారు.. ఏపీలో ఎవరిది అధికారమనేది చూచూయగా కన్ఫం చేస్తాయి. అంటే మే 23వరకూ కూడా ఆగకుండానే 19కే ఏపీలో పీఠం ఎవరిదనే క్లారిటీ వచ్చేస్తుందన్నమాట..

అయితే ఎగ్జిట్ పోల్స్ నూటికి నూరు శాతం ప్రతిఫలిస్తుందని అనుకోలేం.. ప్రజాతీర్పులో ఏమైనా జరగొచ్చు. అందుకే 19కు సగం క్లారిటీ వచ్చిన 23వ తేదీనే అసలు సిసలు ఫలితం వస్తుంది. మే 23న మధ్యాహ్నం వరకూ ఆగితే దేశాన్ని, ఏపీని ఏలే నాయకులు ఎవరో తేటతెల్లం అవుతుంది.
    

Tags:    

Similar News