గత కొన్ని రోజులుగా దేశంలో ఎక్కడ చుసిన ఆడవాళ్లపై అఘాయిత్యాలు - హత్యాచారాలు ..ఎక్కువైపోతున్నాయి. నడిరోడ్డుపై ఒంటరిగా ఆడపిల్ల వెళ్లలేని పరిస్థితి వచ్చేసింది. పోలీసులు - ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు - కఠిన నియమాలు తెచ్చినప్పటికీ ఆడవారిపై జరిగే దారుణాలు మాత్రం ఆగడంలేదు. రోజురోజుకి ఇలాంటి ఘటనలు ఇంకా పెరిగిపోతున్నాయి. ఈ దారుణాలపై గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్ లో దిశ ఉదంతం పార్లమెంట్ లో వేడి పుట్టించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ మాజీ అధినేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. శనివారం కేరళలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ...ప్రపంచానికి భారత్ అత్యాచారాల రాజధానిగా మారిందని, మన దేశ పరిస్థితిని చూసి అంతర్జాతీయ సమాజం మనల్ని ఎగతాళి చేస్తుందని ఆయన అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నా ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన విశ్వ హిందూ పరిషత్ (VHP) నాయకురాలు సాధ్వీ ప్రాచీ ..రాహుల్ మండిపడ్డారు. ఈ సందర్భంలోనే దేశ తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూనే పెద్ద రేపిస్టు అంటూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మన దేశం రాముడు - కృష్టడు నడయాడిన పుణ్యభూమి. అసలు నెహ్రూనే పెద్ద రేపిస్టు. ఆయన మన సంస్కృతిని నాశనం చేశారు. టెర్రరిజమ్ - నక్సలిజమ్ - అవినీతి - అత్యాచారాలు..ఇవన్నీ నెహ్రూ కుటుంబం ఇచ్చిన బహుమతులని కొత్త వివాదానికి తెరతీశారు. నెహ్రూ కుటుంబం ఇచ్చిన బహుమతులని వారసులుగా రాహుల్ కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.