పేర్ని నాని.. ఈ రొడ్డు మాటలు ఆపరా?

Update: 2022-01-04 03:55 GMT
ఉత్సాహం ఉండాలి. కానీ.. అది పరిమితుల్ని దాటకూడదు. వాదన వినిపించాలి. కానీ.. చూసే జనాలకు అదో తొండి వాదనగా కనిపిస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ చిన్న విషయాన్ని మిస్ అయ్యారు ఏపీ మంత్రి పేర్ని నాని. సినిమా థియేటర్ల టికెట్ల వివాదానికి సంబంధించి టీవీ9 చేపట్టిన ప్రత్యేక చర్చా కార్యక్రమం అందరి చూపు పడేలా చేసింది. ఈ చర్చలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఫోన్ లో మంత్రి పేర్నినాని హాజరయ్యారు. రాంగోపాల్ వర్మ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు రొడ్డు కొట్టుడుగా.. ఏ మాత్రం లాజిక్ లేనివిగా ఉండటం కనిపించింది. మంత్రి అన్న విషయాన్నిపక్కన పెడితే.. తాను సినిమా అభిమానిగా చెప్పుకున్నారు పేర్ని నాని. ఈ పాయింట్ లో ఆయన్ను తప్పు పట్టేదేమీ లేదు. కానీ.. ఆ తర్వాత ఆయన నోటి నుంచి వచ్చే మాటలే ఆయన్ను ప్రశ్నలు వేసేలా మారాయి. సినిమాటోగ్రఫీ చట్టం ఎప్పటి నుంచో అమల్లో ఉందని.. తాను.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్తగా పెట్టింది కాదన్నారు. ఈ మాటనే చూస్తే.. ఎప్పటి నుంచో ఉన్న చట్టాన్ని తాము ఫాలో అవుతున్నామని చెప్పే పేర్ని నాని.. కీలకమైన అంశాన్ని మర్చిపోయి అదాటున మాట్లాడేసినట్లుగా కనిపిస్తోంది.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికే రాజధాని అమరావతి ఉందని.. దానికి సంబంధించిన చట్టం కూడా ఉంది కదా? మరి.. ఉన్న చట్టాన్ని యథాతధంగా ఫాలో కాకుండా.. దాన్ని ఎందుకు మార్చేశారు? అప్పటికే ఉన్న చట్టాన్ని మార్చేసి ఒక రాజధాని బదులుగా మూడు రాజధానుల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చినట్లు? పేర్ని నాని చెప్పిన మాటల ప్రకారం.. తమ ప్రభుత్వం అప్పటికే ఉన్న చట్టాన్నిఫాలో అవుతామన్నప్పుడు అన్నింటిలోనూ అదే తీరును ప్రదర్శించాలి కదా?

అమరావతి విషయంలో ఒకలా.. సినిమా టికెట్ల విషయంలో మరోలా ఉండకూడదు కదా? అయినా..అప్పుడెప్పుడో తయారు చేసిన చట్టాన్ని కాలానికి అనుగుణంగా మార్పులు ఎందుకు చేయకూడదు? నిజానికి సినిమాటోగ్రఫీ చట్టాన్ని తయారు చేసిన వేళలో.. మల్టీఫ్లెక్సుల కాన్సెప్టే లేదు. ఆ మాటకు వస్తే కొత్తగా వచ్చిన ఓటీటీ కూడా లేదు. కొత్తగా వచ్చిన మార్పులకు అనుగుణంగా మార్పులు చేస్తేనే కదా కాలపరీక్షకు నిలిచేది. అందుకుభిన్నంగా ఉన్నచట్టాన్ని తాము మార్చలేమన్న మాటల్ని చూస్తే.. తమకు తగ్గ వాదనను వినిపించాలన్న ఆలోచన తప్పించి.. మరింకేమీ లేదన్న విషయం అర్థమవుతుంది.

తమ ప్రభుత్వం ఏప్రిల్ లో జారీ చేసిన జీవోను ఒక న్యాయమూర్తి సమర్థించారని.. మరో జడ్జి దానిలోకొన్ని మార్పులు చేయాలన్నారని చెప్పారు. శాటిలైట్.. ఓటీటీకి అమ్మినప్పుడు ప్రభుత్వంతో సంబంధం లేదని.. థియేటర్లలో విడుదల చేసినప్పుడు మాత్రం నిబంధనల్ని పాటించాలని పేర్కొన్నారు. మొత్తంగా.. ప్రభుత్వ పాలసీ అంటూ మాటలు చెప్పే క్రమంలో పేర్ని నాని అడ్డంగా దొరికిపోయారన్న మాట వినిపిస్తోంది.


Tags:    

Similar News