‘దేశం కోసం’ అనే డైలాగు వాడేటోళ్లు ఇది చదవాల్సిందే

Update: 2021-03-23 04:30 GMT
మోడీషాల రాజకీయమే రాజకీయం. పన్ను మోత మోగిస్తూ కూడా.. దాని గురించి పల్లెత్తు మాట అన్నంతనే దేశద్రోహ నేరాన్ని వేసే మైండ్ సెట్ ను తయారు చేసినందుకు థ్యాంక్స్ చెప్పాలి.  ఇలాంటి వారి పుణ్యమా అని.. సామాన్యుడి.. సగటుజీవి జీతాలు పెరగకున్నా.. బాదుడు మాత్రం ఒక రేంజ్లో పెరిగిన వైనం పార్లమెంటు సాక్షిగా వెల్లడైంది. గత ప్రభుత్వాల మాదిరి అప్పుడప్పుడు లీటరుకు రూపాయి.. రెండు రూపాయిలు పెంచటం.. రోజువారీగా ఐదు పైసలు.. పది పైసలు మాత్రమే పెంచుతామని చెప్పి.. చివరకు లీటరు పెట్రోల్ వంద దగ్గరకు.. డీజిల్ తొంభైను దాటించిన ఘనత మోడీ సర్కారుదే.

రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్.. డీజిల్ ధరలపై పెద్ద ఎత్తున నిరసన.. ఆందోళన వ్యక్తమైనా పెద్దగా పట్టించుకోకపోవటం ఒక ఎత్తు అయితే.. ఇలా తప్పు పట్టే వారిని ద్రోహులుగా చిత్రీకరిస్తూ మోడీ పరివారం చేసే ప్రచారానికి మాత్రం అవాక్కు అవ్వాల్సిందే. దేశం కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా? అంటూకామెంట్లు.. సుద్దులు చెప్పేటోళ్లు ఎక్కువ అయ్యారు. ఇలాంటివేళ.. అలా వెనకేసుకొచ్చే బ్యాచ్ కళ్లు తెరవటం కోసం ఎవరో పుణ్యాత్ముడు ఒక చక్కటి ప్రశ్నను పార్లమెంటులో ప్రశ్నించారు.

పన్ను రూపేణ కేంద్ర సర్కారుకు వస్తున్న ఆదాయం గడిచిన ఆరేళ్లలో ఎంత మేర పెరిగిందన్న సూటి ప్రశ్నకు.. కేంద్ర పెట్రోలియం శాక సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు. పన్నుల రూపేణ కేంద్రానికి గడిచిన ఆరేళ్లుగా 300 శాతానికి పెంచుకున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి మామూలుగా వచ్చే ఆదాయాన్ని 300 శాతం పెంచుకోవటం బాగానే ఉంది. మరి.. ఇదే ఆరేళ్ల వ్యవధిలో సామాన్యుడి ఆదాయం ఏమేరకు పెరిగింది? సామాన్యుడ్ని వదిలేద్దాం.. మీ జీతం ఎంత పెరిగింది? ఇంత తెలిసిన తర్వాత కూడా బాదుడు దేశం కోసమే అన్న మాటను ఇంకా చెబుతారా?
Tags:    

Similar News