తెలంగాణను సాధించాం. బంగారు తెలంగాణ దిశగా దూసుకెళ్లిపోతున్నాం. ఇక.. మిగిలింది దేశమే. అందుకే బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశామన్నట్లుగా మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. నిజమే.. ఆయన మనసులో తెలంగాణ కాస్తా బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం పరుగులు తీస్తుండొచ్చు.
అలా ఫీల్ కావటం తప్పేం కాదు. కానీ.. ఆ హడావుడిలో పార్టీలో పట్టును గులాబీ బాస్ కోల్పోతున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. ఇలాంటి భావన కలుగక మానదు.
ఒక ప్రాంతీయ పార్టీ.. అందునా అధికారంలో ఉన్న వేళ.. మంత్రుల మీద ఎమ్మెల్యేలు అలగటం ఏమిటి? వారి మధ్య బేధాభిప్రాయాలు అంతకంతకూ పెరిగి.. ఎవరి దారిన వారు ఉండటం ఏమిటి? అవేమీ పట్టనట్లుగా ముఖ్యమంత్రి ఉండటం ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
గులాబీ బాస్ అన్నంతనే మంత్రులు మొదలు ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలంతా వణికిపోతారన్న పేరుంది. అలాంటి పార్టీలో.. మంత్రి మల్లారెడ్డిపై ఐదుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేయటం ఏమిటి?
పార్టీలో ఇలాంటిది ఇదే మొదలా? అంటే కాదని చెప్పాలి. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే.. ప్రతి జిల్లాకు చెందిన మంత్రితో మిగిలిన అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఏదో ఒక పంచాయితీ నెలకొన్న విషయం తెలిసిందే. ఇలాంటప్పుడు.. ఇంటిని ముందు సర్దుకోవాల్సిన కేసీఆర్.. ఆ పనిని వదిలేసి దేశాన్ని బాగు చేసేందుకు వీలుగా జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలని తపించటం.. ఆ దిశగా అడుగులు వేయటంలో అర్థం లేదన్న మాట వినిపిస్తోంది.
సాధారణంగా ప్రాంతీయ పార్టీలు ఏవైనా కానీ.. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.. మంత్రుల గుండెల్లో ఎంత ఉన్నా.. వారెవరూ బయటపడేలా వ్యవహరించరు.కానీ.. అందుకు భిన్నంగా గులాబీ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయని చెప్పాలి. ఈ విషయంలో కేసీఆర్ మరింత అప్రమత్తంగా ఉండకపోతే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. మరేం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.