ప్రస్తుతం దేశాన్ని కరోనా ముంచేస్తోంది. దాదాపు నెల రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అదేసమయంలో మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్రం సహా రాష్ట్రాల పాలన కుంటు పడిందనే చెప్పాలి. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి చోట్ల .. ఎక్కడా సీఎంలు పాలనపై దృష్టి పెట్టడం లేదు. కేవలం కరోనాను ఎలా ఎదుర్కొనాలి.. ఆర్థికంగా ఇప్పుడు ఎదురవుతున్న సమస్యలను ఎలా తట్టుకోవాలి? కేంద్రం నుంచి టీకాలు ఎన్ని తెచ్చుకోవాలి? అనే అంశాలపైనే దృష్టి పెడుతున్నారు.
ఒడిసాలో అయితే.. ఏకంగా.. ప్రభుత్వం పూర్తిగా కరోనాకే పరిమితమైంది. అక్కడ అధికారులు అందరూ కూడా కరోనా కార్యకలాపాలకే పరిమితం కావాలని.. అక్కడి ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇక, ఇటీవలే కొత్తగా కొలువు దీరిన బెంగాల్ సర్కారు కూడా కేవలం కొవిడ్ కేసులపైనే దృష్టి పెడుతున్నట్టు చెప్పింది. ఇక, పోరుగున ఉన్న తెలంగాణ కూడా పాలనను ముందుకు తీసుకువెళ్లడం లేదు. సంక్షేమాన్ని చాలా రోజులుగా పక్కన పెట్టి.. కేవలం కేసులు, వైద్య సేవలు, ఆసుపత్రుల పరిశీలనకే పరిమితం అయింది. అయినప్పటికీ.. ప్రభుత్వం .. కోర్టు నుంచి విమర్శలు ఎదుర్కొనవలసి వచ్చింది.
అయితే.. వీటన్నింటికీ డిఫరెంట్‌గా.. ఏపీ ప్రభుత్వం మాత్రం అటు వైద్య సేవలను.. కరోనా బాధిత వ్యక్తులను ఆదుకుంటేనే సంక్షేమానికి మెరుగులు దిద్దుతోంది. ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోకుండా.. సీఎం జగన్ నిత్యం సమీక్షిస్తున్నారు. పింఛన్లు ఆగకుండా అందజేశారు. అదేవిధంగా రేషన్ అందించారు. ఇక, ఈ నెల చివరిలో రైతు భరోసా అందించేందుకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు.
అదేసమయంలో.. పేదలకు ఇళ్లు పథకాన్ని కూడా ముందుకు తీసుకువెళ్లేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా అంగన్ వాడీలను బలోపేతం చేయడంతోపాటు.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వసూలు చేసేందుకు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. టీకా విషయంలోనూ నిరంతరం శ్రమిస్తున్నారు. దీంతో జగన్ పైకి చెప్పకపోయినా.. రోజుకు 15-18 గంటలు పనిచేస్తున్నారనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.