చంద్రబాబు పప్పులు ట్విటర్లలో కూడా ఉడకడం లేదు!

Update: 2019-08-14 07:22 GMT
''గత 5 ఏళ్లలో 21 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశాం. వేలాది చెక్ డ్యామ్ లు, పది లక్షల పంటకుంటలు తవ్వాం. నీరు-చెట్టు, నరేగా పనులెన్నో చేశాం. జల సంరక్షణ ఉద్యమంగా జరిపాం. మనం చేసిన పనులకు సార్ధకత కృష్ణమ్మ పరవళ్లతోనే, తల్లి గోదావరి జలధారలతోనే..'' అంటూ చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్ పై నెటిజన్లు విరుచుకుపడుతూ ఉన్నారు. చంద్రబాబు పెట్టిన ఈ ట్వీట్ పై వారు కస్సుమంటున్నారు. వాళ్ల చాకిరేవు మామూలుగా లేదు. చంద్రబాబు నాయుడి అధికారిక ట్విటర్ అకౌంట్లో కేకలు పెడుతున్నారు నెటిజన్లు. వాటి వరస ఇలా ఉంది..

''నాయనా చంద్రం సార్ మీరు పూర్తి చేసిన కొన్ని  ప్రాజెక్టుల పేర్లు చెప్పండి విని తరిస్తాం మా వెలుగొండ ప్రాజెక్టు ను పూర్తి చేసింది మీరేన దేవుడా అందుకేనేమో వరదలకి ప్రాజెక్టు నిండి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం మొత్తం మునిగి పోయింది మళ్ళీ ఈ ట్వీట్స్..''

'' నీవు అధికారంలో ఉండగా ఏరోజు అయినా శ్రీశైలము లో గాని సాగర్ లో కానీ పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చిందా బాబు !!!''
 
''అయ్యా మాజీ గారు...మీరున్నప్పుడు ఒక సంవత్సరం లో కేవలం 23రోజులు మాత్రమే వర్షాలు పడ్డాయి..వర్షాలు లేక రైతులు పంటలు ఎండిపోయిన పరిస్థితి ఏర్పడింది... ఇప్పుడేమో మావల్లనే వర్షాలు పడ్డాయి అంటున్నారు..ఎంతైనా మీరు ప్రకృతి తో కూడా పోరాడి గెలిచునవారు...''

''21 ప్రాజెక్ట్స్ ఎక్కడా sir. మీరు మరలా వేసారే కొంచెం కూడా ఆలోచించ రే ఎవరు మెసేజ్ క్రియేట్ చేస్తున్నారో కానీ తనకి మైండ్ దొబ్బిందా హా ?  ఇకనైనా నిజాలు మాట్లాడండి ఇంతవరకు మీరు పాలించిన కాలంలో ఏ ఒక్క ప్రాజెక్టు అయినా స్టార్ట్ చేసి పూర్తి చేశారా హా? కొంచెం విజ్ఞత తో పోస్ట్స్ పెట్టండి''

''సర్ మీరు ముఖ్యమంత్రి గా లేకుంటే వర్షాలు బాగాపడుతాయి రైతు బాగుండాలి నదులు నిండాలి ప్రజలు క్షేమంగా ఉండాలి అంటే మీరు రాజకీయాలనుండి బయటికి వెళ్ళండి అదే మీరు మాకు చేసే అతి పెద్ద లాభము.పాలించే రాజు మంచి మనసుంటే ప్రకృతి కూడా అనుకూలంగా ఉంటుంది..'''

''అయ్యా... సిగ్గు అనిపించడం లేదా 21 ప్రాజెక్టులు
కట్టమని చెప్పుకోడానికి.... కృష్ణ, గోదావరి కూడా
నేనే పుట్టించా ను అంటావు కొన్ని రోజులు ఆగితే..
నిన్ననే ఎన్జీటీ పట్టిసీమ, పురుషోత్తమ పట్నం ఎత్తిపోతలు
ఆపాలని తీర్పు ఇచ్చింది...అంటే దోచుకోడానికి వాటిని కట్టావు
ఇంకా ఎందుకయ్యా..''

''నిజమా ... ఆ 21 projects నారా వారి పల్లెలో కట్టరా ? మీరు projects కట్టింది ఎంత నిజమో మీకు వచ్చిన సీట్లే లెక్క చెబుతుంది.''
 
''21  అని అంటారు  గానీ 23 అంటే లెక్క సరిగ్గా సరిపోతుందని నా అబిప్రాయం... హోహో...... సారీ  23 అంటే మీకు మింగుడు పడదుగా......''

''కెసిఆర్ చక్కగా నీరు ఎత్తిపోసి 100 టీఎంసీ వరకు నీళ్లు దాచుకునే ఏర్పాటు చేసుకున్నాడు. మీరు ఒక్క టీఎంసీ కూడా దాచే పనిచేయలేదు. నేడు చాలా కబుర్లు చెపుతున్నారు. worked for son Now suffering with son stroke.''

అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ పై నెటిజన్లు పవర్ ఫుల్ పంచ్ లు సంధించారు. చూస్తుంటే ట్విటర్లో కూడా చంద్రబాబు నాయుడు పప్పులు ఉడుకుతున్నట్టుగా లేవు!

    

Tags:    

Similar News