మొండోడు రాజు కంటే బలమైనోడన్న సామెత మరోసారి నిజమని తేలింది. ఎవరేం అనుకున్నా సరే.. ఆత్మగౌరవానికి మించింది మరొకటి లేదని స్పష్టం చేసిన ఒక పోలీసు అధికారికి తాత్కాలికంగా కష్టాలు ఎదురై ఉండొచ్చు కానీ.. దేశ వ్యాప్తంగా రాత్రికి రాత్రి.. అందరి నోట్లో నానటమే కాదు.. తాను నమ్మిన దాని విషయంలో తానెంత స్పష్టంగా ఉంటానన్న విషయాన్ని తెలిపిన వైనం అందరిని ఆకట్టుకునేలా చేసింది. అంతేకాదు.. ఆయనపై చర్యలు తీసుకున్న అధికారులు వెనక్కి తగ్గి ఆయన్ను.. విధుల్లోకి తీసుకోవటం గమనార్హం.
ఇంతకూ జరిగిందేమంటే.. మధ్యప్రదేశ్ కు చెందిన రాకేశ్ రాణా అనే పోలీసు కానిస్టేబుల్.. భారీఎత్తున మీసాల్ని పెంచాడు. మెడ వెనుక వరకు అతడి మీసాలు ఉన్నాయి. అయితే.. ఆ మీసాల్ని ట్రిమ్ చేయాలని ఉన్నతాధికారులు చెప్పారు. అయితే.. అందుకు రాకేశ్ ససేమిరా అన్నారు. దీనికి కారణం.. అది తమ ఇంటి సంప్రదాయం అని.. తమ ఆత్మగౌరవంగా తెలిపారు. అయితే.. భారీగా పెంచిన మీసాల్ని ట్రిమ్ చేయకపోగా.. తమ ఆదేశాల్ని జారీ చేసినా.. నో చెప్పిన తీరును తప్పు పడుతూ.. అతన్ని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.
అయితే.. తనను సస్పెండ్ చేసినా సరే.. తాను మాత్రం మీసాల్ని ట్రిమ్ చేసేది లేదని స్పష్టం చేశారు. ఉద్యోగపరంగా తన మీద ఎలాంటి ఫిర్యాదులు లేవని.. మీసాలు ఉండటం తనకు గర్వకారణంగా పేర్కొన్నారు.సస్పెండ్ చేసినా ఫర్లేదు.. ఆత్మగౌరవానికి మించింది మరకొటి లేదని తేల్చేశాడు. రాకేశ్ ఉదంతం అన్నిమీడియాలో ప్రముఖంగా రావటం.. అతడి మాటలకు పలువురు ఫిదా అయ్యారు. అదే సమయంలో మీసాల్ని భారీగా పెంచేసిన ఈ పోలీసు ఉద్యోగి మైండ్ సెట్ ఏమిటన్న విషయంపై ప్రభుత్వానికి స్పష్టతకు వచ్చింది.
అంతేకాదు.. అతన్ని పిలిపించుకొని.. అతనిపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తేశారు ప్రభుత్వ ఉన్నతాధికారులు. అతనిపై విడుదల చేసిన ఉత్వర్తులను వెనక్కి తీసుకున్నారు. దీంతో.. రాకేశ్ రాణా మళ్లీ పోలీస్ శాఖలోని మోటార్ వెహికల్ విభాగపు డ్రైవర్ గా విధుల్లో చేరారు. రాకేశ్ ఎపిసోడ్.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారటమే కాదు.. విధి నిర్వహణ విషయంలోనూ తన కమిట్ మెంట్ ను ఇరు వర్గాల వారు మరోసారి ప్రదర్శించారని చెప్పక తప్పదు.