క‌విత ఇంటి అద్దె బీజేపీ చెల్లిస్తుంద‌ట‌!

Update: 2018-10-08 14:36 GMT
ప‌బ్లిసిటీ కోసం మీడియాను - సోష‌ల్ మీడియాను పొలిటీష‌న్లు విప‌రీతంగా వాడుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియా విస్తృతి పెరిగిన నేప‌థ్యంలో రాజ‌కీయ నాయ‌కులు - సినీ తారలు - సెల‌బ్రిటీలు మాట్లాడే ప్ర‌తి మాట ఆచితూచి మాట్లాడాల్సిన ప‌రిస్థితి ఉంది. త‌మ‌క న‌చ్చ‌ని కామెంట్స్ చేసిన వారిపై నెటిజ‌న్లు విప‌రీతంగా ట్రోట్ చేస్తున్నారు. ఇక కొంద‌రు నేత‌లు ఇచ్చే సిల్లీ స్టేట్ మెంట్స్ పై నెటిజ‌న్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తూ టైంపాస్ చేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే తాజాగా నిజామాబాద్ ఎంపీ క‌విత‌పై నెటిజ‌న్లు సెటైర్లు పేలుస్తున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో బీజేపీ అధికారంలోకి వ‌స్తే త‌న ఇంటికి క‌విత అద్దె క‌ట్టే ప‌నుండ‌ద‌ని - ఆ ఇంటి అద్దె బీజేపీ చెల్లిస్తుంద‌ని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

గ‌త నాలుగున్న‌రేళ్ల పాల‌న‌లో టీఆర్ ఎస్ అవినీతికి పాల్ప‌డ‌లేద‌ని క‌విత అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే రాష్ట్రం అవినీతిమ‌య‌మ‌వుతుంద‌న్నారు. తాను సీఎం కేసీఆర్ కుమార్తె అయినా...అద్దె ఇంటిలో నివాస‌ముంటున్నాన‌ని చెప్పారు. అంత‌కుముందు - బీజేపీ అధికారంలోకి వ‌స్తే..రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల కింద అర్హులైన వారంద‌రికీ ఇంటి అద్దె చెల్లిస్తామ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఆ రెండు ప్ర‌క‌ట‌న‌ల‌ను బేస్ చేసుకుని నెటిజ‌న్లు క‌వితను - ల‌క్ష్మ‌ణ్ ను ట్రోల్ చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే క‌విత‌...ఆ ఇంటి అద్దె ప‌థ‌కానికి అప్లై చేసుకుంటార‌ని మెమెలు పెడుతూ ఎద్దేవా చేస్తున్నారు. వినేవాడు ఎంత వెర్రివాడైనా...మ‌రీ సొంత ఇల్లుకూడా లేద‌ని క‌విత చెప్ప‌డం హాస్యాస్ప‌ద‌మ‌ని కామెంట్స్ చేస్తున్నారు. క‌విత కామెంట్స్ తో సెల్ఫ్ గోల్ వేసుకున్నార‌ని...  ఆ కామెంట్స్....కాంగ్రెస్ చేతికి ఓ అస్త్రంలా దొరికాయ‌ని నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు.

Tags:    

Similar News