ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా నడుస్తున్న ఛాలెంజ్ ఇది. గతంలో ఐస్ బకెట్ ఛాలెంజ్ ఎంత పాపులర్ అయిందో ఇప్పుడీ 10 ఇయర్స్ ఛాలెంజ్ కూడా అంతే పాపులర్ అవుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా ఈ ఛాలెంజ్ ను తీసుకుంటున్నారు. 10 ఏళ్ల కిందట - 10 ఏళ్ల తర్వాత తమ ఫొటోలు ఎలా ఉన్నాయో చెబుతూనే - తమ ఫ్రెండ్స్ కు 10ఇయర్స్ ఛాలెంజ్ విసురుతున్నారు. అయితే ఇప్పుడీ ఛాలెంజ్ ను చిరంజీవి కెరీర్ కు అన్వయిస్తూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పడుతున్నాయి.
10 ఇయర్స్ ఛాలెంజ్ లో భాగంగా ఒకప్పుడు చిరంజీవి - ఇప్పుడు చిరంజీవి అంటూ ప్రజారాజ్యం పార్టీని మరోసారి గుర్తుకుతెస్తున్నారు నెటిజన్లు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఎలా ఉండేవారు - ఎలాంటి దుస్తులు వేసుకున్నారు - ప్రజారాజ్యం పార్టీ సింబల్ ను ఎలా పట్టుకున్నారు లాంటి ఫొటోలను - ఇప్పుడు చిరంజీవి లేటెస్ట్ ఫొటోల్ని మిక్స్ చేస్తూ ఈ ఛాలెంజ్ విసురుతున్నారు.
ఈ పదేళ్లలో చిరంజీవి పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలిగారనే చెప్పాలి. ప్రజారాజ్యాన్ని స్థాపించడం - దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడం - మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడం - ప్రస్తుతం రాజకీయాలకు పూర్తి దూరంగా ఉండడం.. ఇవన్నీ ఈ పదేళ్లలో చకచకా జరిగిపోయాయి.